అమ్మ ఆత్మ శాంతించలేదా..?

0
654
jayalalitha soul in poyes garden

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

jayalalitha soul in poyes gardenతమిళనాడు దివంగత సీఎం జయలలిత ఆత్మ చెన్నైని వదలలేదా? పోయస్ గార్డెన్ మెరీనా బీచుల్లో తిరుగాడుతుందా? అంటే అవుననే అంటున్నారు అక్కడున్నవారు. ముఖ్యంగా అమ్మ నివాసం పోయస్ గార్డెన్లో అయితే రాత్రయితే చాలు వింతవింత ధ్వనులు వినిపిస్తున్నాయట. గుర్తు తెలియని స్వరాలు వినిపిస్తున్నాయట. శశికళ మేనల్లుడు దినకరన్ కుటుంబానికి ఇలాంటి అనుభవం ఎదురైందని.. ఈ కారణంగానే వారు అక్కడి నుంచి బయటపడాలని అనుకుంటున్నారని సమాచారం. అలాగే ఇటీవల జయ బంధువొకరు ఆమె గదిలోకి వెళ్లగా ఇలాగే వింత ధ్వనులు గొంతులు వినిపించడంతో హడలిపోయారట. దీంతో పోయస్ గార్డెన్లో అమ్మ ఆత్మ సంచరిస్తోందని చెబుతున్నారు. మరోవైపు ఆమె ఆత్మ చెన్నైలోని మెరీనా బీచ్ దగ్గరే కనిపిస్తోందంటూ తమిళ వెబ్ సైట్ లు వార్తలు రాస్తున్నాయి. అమ్మ ఆకారాన్ని పోలి ఉన్న ఆత్మ జయలలిత సమాధి సమీపంలోనే సంచరిస్తోందని కోలీవుడ్ సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అమ్మ ఆత్మ అంటూ రీసెంటుగా ఒక ఫోటో కూడా తమిళనాట బాగా సర్క్యులేట్ అయింది. జయలలితది సహజ మరణం కాదని ఆమెపై విష ప్రయోగం జరిగిందని చాలా మంది ఆరోపిస్తున్నారు. దానివెనుక ఉన్న మిస్టరీని చేధించాలని డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అందుకే ఆమె ఆత్మగా మారిందని ఆత్మలను నమ్మే కొందరు వాదిస్తున్నారు.

Leave a Reply