చిన్నమ్మను భయపెడుతున్న అమ్మ ఆత్మ!!

0
576
jayalalitha soul teasing sashikala

Posted [relativedate]

jayalalitha soul teasing sashikala
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ శాంతించలేదా? ఆత్మ రూపంలో ఆమె పోయెస్ గార్డెన్ లో తిరుగుతుందా? అంటే ఔననే అంటున్నారు అభిమానులు. ఇటవల వైరల్ అయిన వీడియోలను సాక్ష్యంగా అందుకు సాక్ష్యంగా చూపెడుతున్నారు. చెన్నై అపోలో ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లో, కార్ పార్కింగ్ ఏరియాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం జయమ్మ ఆకారాన్ని పోలిన ఫోటోలు ఫేస్ బుక్‌లో షేర్ అవుతున్నాయి.అంతేకాదు పోయెస్ గార్డెన్ లోనూ ఇలాగే జరుగుతోందట.

పోయెస్ గార్డెన్ లో అమ్మ ప్రభావం ఎక్కువగా ఉందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆత్మ రూపంలో ఉన్న అమ్మ రాత్రి పూట చిన్నమ్మను భయపెడుతోందని సమాచారం. దీంతో చిన్నమ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులంతా భయపడిపోతున్నారని టాక్. ఆత్మ రూపంలో ఉన్న అమ్మ ఏం చేస్తుందోనని వణికిపోతున్నారని చెబుతున్నారు. ఈ దెబ్బతో రాత్రయితే చాలు.. చిన్నమ్మ కుటుంబసభ్యులు ఇక పోయెస్ గార్డెన్ నుంచి వేరే చోటుకు వెళ్లిపోతున్నారట. దీంతో శశికళ తాంత్రికులను సంప్రదించేందుకు ప్లాన్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. అమ్మ ఆత్మ శాంతికి ఏం చేయాలన్న సంప్రదింపులు కూడా జరుగుతున్నాయట.

అమ్మ ఆత్మ రావడం వెనక శశికళే కారణమన్న వాదన ఉంది. చిన్నమ్మ పార్టీ ప్రధాన కార్యదర్శి కావడం అమ్మకు ఇష్టం లేదట. అందుకే శశికళను అమ్మ ఆత్మ టార్గెట్ చేసిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మరికొందరు మాత్రం ఇదంతా ఫేక్ అని కొట్టిపారేస్తున్నారు. శశికళ ఇమేజ్ ను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్మ ప్రతిరూపం గ్రాఫిక్స్ అని అనుమానిస్తోంది చిన్నమ్మ వర్గం.

Leave a Reply