అమ్మ ఆత్మ శాంతించలేదా?

0
443
jayalalitha Spirit does not peace

Posted [relativedate]

jayalalitha Spirit does not peace
మరణం తర్వాత ఆత్మ శాంతించకపోతే భూమిపైనే ఉంటుందని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా అకాల మరణం చెందిన వారి విషయంలో ఇది ఎక్కువగా జరుగుతుందని చెబుతారు. జయలలిత విషయంలోనూ అలాగే జరిగిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

జయలలిత అంత్యక్రియల సమయంలో జయ రూపాన్ని ప్రతిబింబిస్తూ ఓ కాంతి కనిపించింది. ఈ దృశ్యం ఈ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే అమ్మ అభిమానులు మాత్రం .. ఆ ప్రతిరూపం కచ్చితంగా అమ్మదేనని చెబుతున్నారు. పురుచ్చితలైవి ఎక్కడికీ పోలేదని .. ఆమె ఆత్మ రూపంలో ఇక్కడే ఉందంటున్నారు. ముఖ్యంగా ప్రజల బాగోగులపై జయకు బెంగ ఉందట. అందుకే ఆమె ఆత్మ శాంతి జరగలేదట. అందుకే ఇక్కడే ఆత్మ రూపంలో తిరుగుతోందని మరికొంతమంది చెబుతున్నారు.

జయ ప్రతిరూపంపై మరో ప్రచారం జరుగుతోంది. వారసుల విషయంలో అమ్మ మరణానికి ముందే క్లారిటీకి వచ్చిందట. అయితే అది బయటకు చెప్పేలోగానే జయలలిత కన్నుమూశారు. అందుకే ఆమె ఆత్మ శాంతించలేదని… అది చెప్పడానికే ఇక్కడే కాంతి రూపంలో తిరుగుతోందని ప్రచారం జరుగుతోంది. మరికొందరైతే అమ్మ దైవ సమానురాలని.. అందుకే ఈ కాంతి కనిపించిందని గట్టిగా నమ్ముతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా… ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా కాంతి కనిపించిందని మాత్రం చాలామంది నమ్ముతున్నారు.

Leave a Reply