నెహ్రు,గాంధీ…కాంగ్రెస్,బీజేపీ కి లింకెట్టిన జేసీ..

 jc divakar reddy said to compare congress bjp parties
పవన్ వ్యాఖ్యలపై సెటైర్లేసిన దేశం ఎంపీ జేసీ దివాకరరెడ్డి …భలే పోలిక తెచ్చాడు.గొడవలు జరగవని నాడు గాంధీ,నెహ్రు దేశ విభజనకి ఒప్పుకున్నారని …అయితే ఇప్పుడు రెండు దేశాలు రక్షణ కోసమే వేలకోట్లు ఖర్చుచేస్తున్నాయని అన్నారు.ఇప్పుడు కాంగ్రెస్,బీజేపీ కూడా అలాగే ఆంధ్రని విభజించి ద్రోహం చేశాయని జేసీ ధ్వజమెత్తారు.అసలీ చర్చకి కారణమైన పవన్ మీద అయన చాలా బాంబులు పేల్చారు.

హోదా కోసం ఎంపీలు పోరాడడం లేదన్న వ్యాఖ్యల్ని జేసీ తప్పుపట్టారు.చంద్రబాబుతో చెప్పి తామంతా పవన్ బాటలోనడుస్తామని …అయన హోదా సాధించుకురావాలని సవాల్ విసిరారు.ఏపీ ప్రయోజనాల కోసం ఎన్నో అవమానాలు భరిస్తున్న బాబుని తక్కువ చేసి మాట్లాడ్డం తగదన్నారు.తమకి ఎంపీ పదవి వెంట్రుకతో సమానమని జేసీ స్పష్టం చేశారు.ప్రత్యేక హోదా అంశం సినీ వ్యవహారం కాదని …అది కోట్లాది మంది నిజజీవితాలతో ముడిపడ్డ వ్యవహారమని చెప్పారు.విభజన సమయం లో నాటి కేంద్రమంత్రులు రాజీనామా చేసిఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని చిరునుద్దేశించి పవన్ కి చురకలేశారు జేసీ…మామూలుగానే హీట్ రగిల్చే జేసీ కామెంట్స్ ఈసారి అగ్గిరవ్వలయ్యాయి.

SHARE