జగన్ ని వాడు అనేసి కారణం చెప్పిన ఎంపీ..

Posted January 2, 2017

jc divikar reddy scolds jagan
జేసీ దివాకర్ రెడ్డి …లాభం నష్టం ఇవేమీ పట్టకుండా మనసులో అనుకున్నదంతా బయటకు చెప్పేసే టైపు ..దాని వల్ల ఈమధ్య కాలంలో అధికార టీడీపీ,సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు ,ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారో చూశాం. ఈసారి అయన వైసీపీ అధినేత జగన్ ని తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు.ముచ్చుమర్రి ఎత్తిపోతల పధకం ఆవిష్కరణ సభలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు సమక్షంలోనే జేసీ రెచ్చిపోయారు.

ఓట్లు కావాలనుకునేవాడు పట్టిసీమ,పోలవరాన్ని వ్యతిరేకిస్తాడా .ఈ క్రమంలో జగన్ గురించి వాడు అనే మాట యథేచ్ఛగా వాడేసిన జేసీ అందుకు భలే కారణం చెప్పారు.రాజశేఖర్ రెడ్డి తో వున్న సంబంధం వల్ల చిన్నప్పటినుంచి తెలుసు కాబట్టే ఆ చనువుతో అలా పిలుస్తున్నా గానీ అంతకు మించి దురుద్దేశం లేదన్నారు.ఇక కులం కులం అంటూ కొందరు జగన్ వెంటబడుతున్నారు గానీ అయన వల్ల నష్టం తప్ప ప్రయోజనం ఉండదని జేసీ అలాంటివారిని హెచ్చరించారు.

SHARE