జేసీ కామెంట్స్ గుట్టు విప్పితే మీకు సలాం..

0
319
jc diwakar reddy comments on jagan and chandrababu

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

jc diwakar reddy comments on jagan and chandrababu
జేసీ దివాకర్ రెడ్డి మరోసారి గొంతు విప్పారు.ఆయన నోరు తెరిస్తే ఎంత సంచలనం అవుతుందో వేరే చెప్పాలా? ఈసారి ఆయన ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మరీ మాట్లాడారు.అయితే జేసీ ఎవరిని తిట్టారో,ఎవరిని పొగిడారో ,ఏమన్నారో అర్ధం కావడం లేదు. జేసీ కామెంట్స్ చదివి ఆయన టార్గెట్ ఏమిటో చెప్తే మీకు సలాం కొడతాం..ఇంతకీ జేసీ ఏమన్నారో చూద్దామా ..

1 . ఈ దేశం లో అందరికీ కులాభిమానం ఉంటుంది.నాకు కూడా వుంది.అలా లేదని ఎవరైనా చెబితే అది అబద్ధమే
2 .నాకు కూడా జగన్ పక్కకి వెళ్లాలని వుంది.కానీ ఆయన ఏమి చేస్తాడు ? ఏమీ చేయడు.వాడు వెధవ..సారీ వెధవ అనకూడదుగా..ఆ మాట ఉపసంహరించుకుంటున్నా.
3 . కాంగ్రెస్ పార్టీ కుళ్లిపోయింది.అందుకే ఆ కంపు భరించలేక టీడీపీ లో చేరా.
4 . ఎవరు ఏమి అనుకున్నా ఈ రాష్ట్రానికి ఏమైనా చేయాలంటే చంద్రబాబు వల్లే అవుతుంది. హి ఈజ్ ది మాన్.ఆయనకున్న యోగ్యత,శక్తీ చూసే టీడీపీలో చేరా,కానీ ఆయనేదో మంత్రి పదవి ఇస్తాడని కాదు.
5 . నీళ్ల విషయంలో అనంత జిల్లాలో ఎన్ని ప్రాజెక్ట్స్ అడిగినా బాబు ఎస్ అంటున్నారు.పోలవరం పూర్తి అయితే రాష్ట్రం సుభిక్షం అవుతుంది.

అయితే అవన్నీ బాబు ఇంకోసారి గెలిస్తే కానీ పూర్తి కావు.ఓ వైపు 2019 లోపే పోలవరం పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు ముందే అనేసారు జేసీ.ఇప్పుడు చెప్పండి ఆయన బాబుని తిట్టారా ,పొగిడారా ?

Leave a Reply