జేసీ స్పీడ్ తగ్గింది..కోపం కాదు

 Posted October 29, 2016

jc diwakar reddy fires on gannavaram airport officers
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తరచూ రెండు విషయాల్లో వార్తలకెక్కుతుంటారు. వాటిలో మొదటిది … తనమన,పార్టీ,సందర్భం చూసుకోకుండా అయన చేసే రాజకీయ వ్యాఖ్యల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక రెండో విషయం ..విమానాశ్రయాలకు ఆలస్యంగా వెళ్లడం…బోర్డింగ్ అయిపోయిందని చెప్పగానే అధికారుల మీద విరుచుకుపడటం.జైట్లీ సభ అయిపోయాక విమానాశ్రయానికి లేటుగా వెళ్లిన జేసీ ఈసారి గన్నవరం విమానాశ్రయంలో స్వయంగా ఫర్నిచర్ ధ్వంసం చేయబోయారు.అయన వయసు,హోదా ..ఇలా ఏ విధంగా చూసిన జేసీ ప్రవర్తన వాటికి తగ్గట్టు లేదనే చెప్పుకోవాలి.ఇలా జరగడం ఇదే మొదటిసారి అయితే ఫర్లేదు..కానీ పదేపదే ఒకే విషయం రిపీట్ అవుతుంటే జేసీ ఆలోచించుకోవాలి.కాస్త సమయపాలన పాటిస్తే ఈ సమస్య ఉండదని అంత పెద్దాయనకి మనం వేరే చెప్పాలా?

గన్నవరం విమానాశ్రయం రెండుమూడు సార్లు జేసీ ఆగ్రహాన్ని స్వయంగా చూసిన ఓ సెక్యూరిటీ అధికారి అంతా అయిపోయాక ప్రయాణంలో జేసీ స్పీడ్ తగ్గింది కానీ అయన కోపం తగ్గలేదని వ్యాఖ్యానించారు.

SHARE