జేసీ మళ్లీ కుల వ్యాఖ్యలు… పవన్‌పైనా కామెంట్స్

Posted January 16, 2017

jc diwakar reddy fires on jagan reddy category and comments on pawan kalyanటీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి కుల రాజకీయాన్ని వదిలిపెట్టలేకపోతున్నారు. విజయవాడలో చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపిన జేసీ ఈ సందర్భంగా మరోసారి రెడ్డి కులం గురించి మాట్లాడారు. రెడ్డి సామాజికవర్గాన్ని రెచ్చిగొట్టి లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అసలు జగన్‌ రెడ్డే కాదని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా రెడ్డి కాదని… ఆయన యాదవ కులానికి చెందిన రెడ్డి అని అన్నారు. జగన్ కూడా అసలైన రెడ్డి కాదని… క్రిస్టియన్ రెడ్డి అని అన్నారు. ప్రాజెక్టులను చంద్రబాబే పూర్తి చేస్తున్నారని అన్నారు. తన పార్టీ తలకాయ (చంద్రబాబు) బాగానే ఉందని… కాళ్లు, చేతులు మాత్రం వంకరగా (ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు) ఉన్నాయని జేసీ చెప్పారు.

పవన్ కల్యాణ్‌కు అధికారంలోకి వచ్చేంత సీన్ లేదన్నారు. ఆయనకు నటుడిగా మాత్రమే క్రేజ్ ఉందని జేసీ అభిప్రాయపడ్డారు. సినిమా నటులను చూసి ఓట్లేసే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రశంసనీయమన్నారు. చంద్రబాబును కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జేసీ అనంతరం కోడి పందాలు కోసం గోదావరి జిల్లాలకు వెళ్లారు.

మొత్తం మీద ఈ మధ్య పదేపదే సొంత కులాన్ని చులకన చేసేలా జేసీ దివాకర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. రెడ్లకు ఇకపై చంద్రబాబే దిక్కని.. కాబట్టి రెడ్లంతా టీడీపీకే ఓటేయాలని ఇటీవల బహిరంగంగానే జేసీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా తాను ఎక్కడ సభ పెట్టినా జేసీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. అలా సభలకు వెళ్లిన జేసీ ప్రతిపక్ష పార్టీపైనా, రెడ్డి సామాజికవర్గంపైనా పదేపదే చులకన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను అచ్చమైన రెడ్డిని అని చెప్పుకుంటూనే చంద్రబాబు సమక్షంలోనే రెడ్డి సామాజికవర్గాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తుండడం చర్చనీయాంశమైంది.

SHARE