రాష్ట్ర విభజనకు రెడ్లే కారణమా?

Posted December 22, 2016

jc diwakar reddy said andhra pradesh divided reasons only telangana reddy's
రాష్ట్ర విభజనకు రెడ్డినాయకులే కారణమా? అంటే ఔననే అంటున్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ప్రత్యేకరాష్ట్రం ఏర్పడడానికి తెలంగాణ రెడ్లే కారణమంటున్నారాయన. ఇందులో నిజం లేకపోలేదన్న వాదన బలంగా ఉంది.

ప్రత్యేకరాష్ట్రంపై కాంగ్రెస్ హైకమాండ్ నాన్చుడు ధోరణితో తెలంగాణ నాయకులు ఒక దశలో ఆశలు వదులుకున్నారు. దీంతో తెలంగాణలోని ముఖ్యనేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ.. లాంటి నాయకులు అప్పట్లో సోనియాపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎటూ టీడీపీ, జగన్ పాతుకుపోయారు కాబట్టి.. తెలంగాణ ఇస్తే ఇక్కడ మనదే అధికారమని కూడా చెప్పారు. మరీ నాన్చితే పార్టీని వీడిపోతామని బెదిరించారు కూడా. సీమాంధ్రలో ఎలాగూ పోయింది..కనీసం తెలంగాణలోనైనా నిలబడదామని కాంగ్రెస్ హైకమాండ్ కూడా చివరికి ఒప్పుకుంది. తెలంగాణ ఇచ్చేసింది. కానీ ఆ క్రెడిట్ తీసుకోవడంలో హస్తం పూర్తిగా వెనకబడిపోయింది. దీంతో ఇక్కడ ప్రతిపక్షానికే పరిమితమైంది.

తెలంగాణ రావడానికి కారణమైన రెడ్డి నాయకులు… ఇక్కడ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. అందుకే జేసీ దివాకర్ రెడ్డి ఈ మధ్య తెలంగాణ అసెంబ్లీకి వచ్చి మరీ తన రెడ్డి నాయకులకు తలంటారు. అంతా మీరే చేశారంటూ తిట్టిపోశారు. మీ వల్లే అనంతపురం, కర్నూలు జిల్లాలు ఆగమయ్యాయని ఆవేదన వెళ్లగక్కారు.

SHARE