Thursday, December 2, 2021
Homelatestజేసీకి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బాబు

జేసీకి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన బాబు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి రాజకీయ ఎత్తుగడలు వేస్తారో ఎవరికీ అర్థం కాదు. అయితే ఈ సంగతి జూనియర్లకే కాదు జేసీ లాంటి సీనియర్లకూ ఎక్కడం లేదన్నది ఇప్పుడు తేలిపోయింది. మాట్లాడితే పోలవరం 2019కి కూడా పూర్తికాదని, కలలన్నీ నిజమవ్వాలని లేదని బాబుకు పంటి కింద రాయిలా తయారైన అనంత ఎంపీ జేసీకి. సొంత జిల్లాలోనే రివర్స్ పంచ్ ఇచ్చారు బాబు. కొంతమంది సన్యాసం తీసుకుంటామంటున్నారని, అయినా సిగ్గు లేకుండా పాలిటిక్స్ లో కొనసాగుతున్నారని రిటార్ట్ ఇచ్చారు.

2018 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీళ్లిస్తామనేది చంద్రబాబు చెప్పే మాట. అయితే ఆయన కేవలం మాటలకే పరిమితం కాలేదు. ప్రతి సోమవారం పోలవారం పేరుతో సమీక్షలు జరుపుతున్నారు. అడపాదడపా క్షేత్రస్థాయికి వెళ్లి పనులు పర్యవేక్షిస్తున్నారు. సీఎం ఇంత చేస్తుంటే కనీసం సహకరించకపోగా.. పోలవరం అయ్యేదా. చచ్చేదా అని సొంత పార్టీ నేతలే మాట్లాడటం బాబుకు ఆగ్రహం కలిగించింది. మిగతా వారి సంగతి పక్కనపెడితే తన సమక్షంలోనే తాను చెప్పే మాటల్ని ఎద్దేవా చేస్తున్న జేసీకి పంచ్ ఇవ్వాల్సిందేనని బాబు డిసైడయ్యారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం సభను వేదికగా చేసుకున్న చంద్రబాబు. జేసీ మాట్లాడాక మైక్ అందుకుని అదిరిపోయే పంచ్ ఇచ్చారు. పోలవరం ఎందుకు కాదో తాను చూస్తానని, ఇప్పుడు సన్యాసం తీసుకుంటామన్నవారు. అప్పుడేం చేస్తారో చూద్దామని ప్రజలకు చెప్పారు. దీంతో అక్కడే ఉన్న ఎంపీ జేసీ కంగు తిన్నారు. ఇప్పటికే అల్లుడు దీపక్ రెడ్డి ఘనకార్యాలకు బాబు దగ్గర మార్కులు కోల్పోయిన జేసీ. ఇప్పుడు మళ్లీ చిక్కుల్లో పడ్డారని అనంత టీడీపీ నేతలు ఆనందపడుతున్నారు. ఎంత లాస్ట్ టైమ్ ఎంపీ అని ఫిక్సైతే మాత్రం నోటికొచ్చినట్లు వాగితే ఊరుకునేది లేదని చెప్పకనే చెప్పారు చంద్రబాబు.

- Advertisment -
spot_img

Most Popular