శత్రువు సలహా పాటిస్తున్న రఘువీరా?

Posted October 12, 2016

  jc prabhakar reddy comment  raghuveera reddy
రాజకీయాలు బహు చిత్రంగా వుంటాయనడానికి ఇది తాజా ఉదాహరణ.శత్రువు సలహా పాటించమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా మీద ఒత్తిడి వస్తోంది.ఆ సలహా పాటించమని పట్టు బడుతున్న వాళ్ళు మరెవరో కాదు.అనుక్షణం ఆయన్ని అంటిపెట్టుకుని వుండే సహచరులు, అనుచరులే .రాజకీయశత్రువు అనుచరుల్ని మెప్పించేంత సలహా ఇచ్చింది మాత్రం జేసీ ప్రభాకరరెడ్డి. అనంతపురం జిల్లాలో జేసీ,రఘువీరా ల మధ్య వైరం అందరికీ తెలిసిందే.ఇద్దరూ ఒకే పార్టీ లో వున్నప్పుడు కూడా ఉప్పునిప్పు లాగే మెలిగారు.జేసీ ఫామిలీ టీడీపీ లోచేరడం,రఘువీరా కాంగ్రెస్ లోనే ఉండిపోవడంతో ఆ వైరం ఇంకాస్త పెరిగింది.

పీసీసీ అధ్యక్ష హోదాలో రఘువీరారెడ్డి చంద్రబాబు ప్రభుత్వం మీద ఏదో విమర్శలు చేయడం..అదే జిల్లాకి చెందిన నేతలుగా జేసీ బ్రదర్స్ కౌంటర్ ఇవ్వడం ఈ రెండున్నరేళ్లలో ఎన్నోసార్లు జరిగింది.అయితే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఓ ప్రెస్ మీట్ లో రఘువీరాని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ లో ఉండి నువ్వేమి చెప్పినా జనం నమ్మరు…పార్టీ మారడం మంచిదన్నారు.అప్పటికే అదే అభిప్రాయంతో ఉన్న రఘువీరా అనుచరులు మొహమాటం పక్కన పెట్టి ఆ సలహా పాటించమని తమ నాయకుడిపై ఒత్తిడి పెంచారట.రఘువీరా కూడా పార్టీ మార్పు అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం .వైసీపీ ,టీడీపీ ల్లో ఎటు మొగ్గాలన్నదానిపై తర్జనభర్జన మొదలైందట.అదే జరిగితే ఏపీ లో కాంగ్రెస్ పరిస్థితి మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్టే.

SHARE