తాడిపత్రిలో 3 .60 కోట్ల కార్ …కొడుక్కి ఎమ్మెల్యే గిఫ్ట్

0
357
jc prabhakar reddy costly car gift to son

Posted [relativedate]

jc prabhakar reddy costly car gift to sonతాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కి ఓ ఖరీదైన కోరిక వుంది.అది ల్యంబోగి మోడల్ కి చెందిన స్పోర్ట్స్ కార్ నడపాలని.ఆ కారు ఖరీదు అక్షరాలా మూడు కోట్ల అరవై లక్షలు.ఇటలీ లో తయారయ్యే ఈ కార్ ని ఇండియా తీసుకురావడం అంత తేలికైన విషయం కాదు.ముంబై దాకా నౌకలో,అక్కడి నుంచి ఓ కంటైనర్ లో తాడిపత్రి వచ్చింది.ఇంతా శ్రమపడి తాడిపత్రి దాకా తెప్పించిన కారుని తన కోరిక తీర్చుకోడానికి కాకుండా కొడుక్కి బహుమానంగా ఇచ్చాడు జేసీ ప్రభాకర్ రెడ్డి.ఎందుకంటే …అలాంటి స్పోర్ట్స్ కార్ నడపడానికి తన వయసు సహకరించదట.అందుకే కొడుకు అస్మిత రెడ్డి కి ఆ కారు గిఫ్ట్ గా ఇచ్చి ఆ కుర్రోడు దాన్ని నడుపుతుంటే చూసి పొంగిపోతున్నారు.

ఈ స్పోర్ట్స్ కార్ మీద జేసీ ఇంతగా మోజు పడడానికి …చివరికి కొడుకు ద్వారా ఆ కోరిక తీర్చుకునేలా చేయడానికి ఆ కార్ లో వున్న విశేషాలే కారణం.ఈ స్పోర్ట్స్ కార్ లో ఇద్దరు మాత్రమే కూర్చోడానికి అవకాశం వుంది.ఈ కారు వేగం గంటకి 320 కిలో మీటర్లు ఉంటుంది.ఇక మైలేజ్ విషయానికి వస్తే అంత తేలిగ్గా దాన్ని మైంటైన్ చేయలేరు.ఎందుకంటే ..లీటర్ పెట్రోల్ కేవలం 3 కిలో మీటర్లు మాత్రమే నడుస్తుంది.ఇదంతా బాగానే వుంది.అంత ఖర్చు పెట్టి జేసీ గారు కోరిక తీర్చుకోవడం మాటేమోగానీ ఆ కార్ తాడిపత్రి రోడ్ల మీద పరుగులు తీయడం పెద్దగా మ్యాచ్ అవ్వదేమో!

Leave a Reply