ప్రత్యర్థి ఊరికెళ్ళి మరీ జేసీ హల్ చల్ ..

Posted February 2, 2017

jc prabhakar reddy halchal in timmampalliఓ రాజకీయ నాయకుడు ఇలాగే ఉండాలి …ఇలాగే మాట్లాడాలి అనే లెక్కల్ని ఎప్పుడో చెరిపేసారు జేసీ బ్రదర్స్ .ఆ చెరిపేసిన చోట తమదైన ప్రత్యేకతతో కొత్త లెక్కలు రాస్తున్నారు.జేసీ దివాకర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై నోటి దూకుడు ప్రదర్శిస్తుంటే ..ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి నాలుగు ఆకులు ఎక్కువే చదివారు.ఆయన ఈసారి ఎవరూ ఊహించని విధంగా తన రాజకీయ ప్రత్యర్థి,తాడిపత్రి వైసీపీ సమన్వయకర్త పెద్దారెడ్డి సొంతూరు తిమ్మంపల్లి వెళ్లి హల్ చల్ చేశారు. అక్కడ తానూ ఓ ఇల్లు కొనుక్కుంటానని చెప్పారు.పెద్దారెడ్డి తాడిపత్రి రాగాలేనిది తాను తిమ్మంపల్లి వస్తే తప్పేంటని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు.తిమ్మంపల్లి లో ఇల్లు కొనుక్కుంటానని చెప్పిన జేసీ తమకు ఎక్కడెక్కడ ఇళ్లు ఉన్నాయో చెప్పారు . విజయవాడ,హైదరాబాద్,బెంగళూరు,తాడిపత్రిలో తమకు ఇళ్లు ఉన్నాయని చెప్పిన జేసీ ఊటీలో ఓ గెస్ట్ హౌస్ ఉందన్నారు. 

ఇలా జేసీ తమ వూరొచ్చి చేస్తున్న హడావిడి చూసిన పెద్దారెడ్డి నవ్వితూనే తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.అక్కడి రెడ్లకి పౌరుషం ఉందో లేదో తెలీదు కానీ …తమకి పౌరుషం ఉందని ..మాట పడే రకం కాదని హెచ్చరించారు.ఇక ప్రభాకర్ రెడ్డి మునిసిపల్ సొమ్ము తిని పంది కన్నా హీనంగా బతుకుతున్నారని పెద్దారెడ్డి వ్యాఖ్యానించారు.జేసీ వైఖరి ,పెద్దారెడ్డి మాటలు చూస్తుంటే తాడిపత్రి మళ్లీ రగులుకునేలా ఉందనిపిస్తోంది.

 

SHARE