మొగుడు పెళ్ళాల లిప్ కిస్ తెరపై..

  jd chakravarthi anukruthi lip lock kiss ramgopal varma savithri movie
‘సావిత్రి’ సినిమా పుణ్యమాని ఒకింటివారయ్యారు అనుకృతి, హీరో జేడీ చక్రవర్తి. ఆ సినిమా పేరుకు రామ్‌గోపాల్‌ వర్మదే అయిన్పటికీ, దాన్ని డైరెక్ట్‌ చేసింది జేడీయేనట. ఇందులో ఓ కీలకపాత్రలో ఆయన కూడా నటించాడు. ఇంతకీ అసలు విషయమేమంటే ఈ సినిమాలో జేడీ, అనుకృతిల మధ్య ఓ ఘాటైన ముద్దు సీన్‌ ఉందట. సాధారణ కిస్సింగ్‌ సీన్‌లకు భిన్నంగా సుదీర్ఘంగా ఈ సీన్‌ సాగుతుందట.

అయితే ఇప్పుడా సీన్‌ సినిమాలో ఉంటుందో, ఉండదో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జేడీ, అనుకృతి భార్యాభర్తలు అయిపోయారు కాబట్టి ఆ సీన్‌ ఉంటే బాగోదని కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. మరికొంతమంది మాత్రం ఆ సీన్‌ ఉంటే ‘సావిత్రి’కి మరింత క్రేజ్‌ వస్తుందని అంటున్నారట. మరి ఈ విషయంలో రామ్‌గోపల్‌ వర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

SHARE