రెడ్డి ఫేట్ మార్చేసిన జేడి..!

Posted November 16, 2016

JD Chakravarthi Recommend Script For Srinivas Reddy Movieకమెడియన్ నుండి హీరోగా మారుతున్న వారిలో ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి కూడా చేరిపోయాడు. గీతాంజలి తర్వాత కొద్ది పాటి గ్యాప్ తీసుకున్న రెడ్డి ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురాతో రాబోతున్నాడు. ఈ నెల 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి అయితే బాగుంటాడు అని జెడి చక్రవర్తి కథ విన్నప్పుడే అభిప్రాయపడ్డాడట. గీతాంజలి తర్వాత చాలా కథలు తన వద్దకు వచ్చినా అవన్ని హర్రర్ నేపథ్యంతో వచ్చినవే అని.. అయినా సరే వాటిలో ఓ సినిమా మొదలు పెట్టినా అది అటకెక్కిందని అన్నారు శ్రీనివాస్ రెడ్డి.

ఇక శివరాజ్ కనుమూరి కథ చెప్పగానే కనెక్ట్ అయ్యానని తనకు కథ చెప్పమని జెడి ప్రిఫర్ చేశారగానే తనతో పరిచయం లేకపోయినా తన క్యారక్టర్ కు ఈ సినిమా సూట్ అవుతుందని చెప్పిన జెడి చక్రవర్తికి థాంక్స్ చెప్పుకున్నారు రెడ్డి. ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయమని తెలుస్తుంది. మోషన్ పోస్టర్ త్రివిక్రం.. టీజర్ సాంగ్ సుకుమార్.. ట్రైలర్ కొరటాల శివతో రిలీజ్ చేయించిన చిత్రయూనిట్ అన్ని విభాగాల్లో సినిమా ప్రేక్షకుల్లో తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతుంది. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలిక.

SHARE