జీవా కాజల్ రొమాన్స్…

  jeeva kajal full romance new movieసైలంట్‌గానే ఛాన్స్‌లు పట్టేస్తోంది కాజల్. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, తమిళంలో అజిత్‌ సినిమాల్లో కథానాయికగానే కాక.. ఐటమ్‌ సాంగ్స్‌కూ సై అంటోంది. ఇక లేటెస్ట్‌గా జీవాతో చేసిన ‘కావలై వేండమ్’ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్న ఈ సినిమా టీజర్ విడుదలకు చిత్ర బృందం కృషిచేస్తోంది. ఇదిలాఉంటే, ఈ మూవీలో కాజల్, జీవాల మధ్య కెమిస్ట్రీని చూసి అభిమానులు అవాక్కవడం ఖాయమని సినీ యూనిట్ చెప్తోంది. దీనికి తగ్గట్టుగానే చిత్ర ప్రమోషన్‌ కోసం రూపొందించిన పోస్టర్స్ ఉన్నాయి. ఈ ఫోటోలను బట్టి కాజల్, జీవాలు రొమాన్స్ పండించారని అంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. పోస్టర్ లలోనే ఈ జంట ఇంతగా రెచ్చిపోతే ఇక సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రే ఏ రేంజ్ లో ఉంటుందో.

SHARE