ప్రకృతిలో పడక – జీరో స్టార్ హోటల్ స్పెషాలిటీ..

0
762

jero hetel2

ట్విన్స్ ప్రాంక్, ప్యాట్రిక్ రిక్లిన్.. హోటల్ రంగంలో అరుదైన ప్రయోగాలు చేస్తున్న ఈ ఇద్దరు సోదరులు కొత్త ఐడీయా తో మళ్లీ ముందుకొచ్చారు. ఈ సారి వీళ్ళ ఐడియా.. ప్రకృతిలో పడక… పైనా ఆకాశం.. కింద భూమాత.. మధ్యలో మాత్రం ఖరీదైన మంచం, కొద్దిపాటి వెలుతురు నిచ్చే లాంప్.. ఇక చుట్టూ పచ్చదనం పరవళ్లు తొక్కే ప్రకృతి.. వాట్ ఆ రొమాంటిక్ ఐడియా ..?

ఈ హోటల్ ఆతిధ్యం అందుకోవాలంటే స్విస్ ఆల్ప్స్ పర్వత శ్రేణికి వెళ్లాల్సిందే.. సముద్ర మట్టానికి దాదాపు ఆరువేల అడుగులు ఎత్తున మల్లె పువ్వు లాంటి తెల్లధనంతో అతిధుల కోసం బెడ్ ఎదురు చూస్తూ ఉంటుంది. కస్టమర్ కి అవసరమైన సేవలు అందించాక వున్న ఒక్క బట్లర్ కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక వెళ్లిన వాళ్లదే ఆ సామ్రాజ్యమంతా…

brothers

ఈ హోటల్ పెట్టిన అన్నదమ్ములు ఇంతక ముందు ఇలాంటి ప్రయోగాలు చేశారు.. ‘నల్ స్టెర్న్’ బ్రాండ్ తో జీరో స్టార్స్ హోటల్స్ ఓపెన్ చేశారు. జీరో స్టార్ ఏంటంటే.. ఇక్కడికి వచ్చే కస్టమర్ మా స్టార్ అన్నది వీళ్ళ కొటేషన్.. ఓ యుద్ధ బంకర్ లో వీళ్ళు ఏర్పాటు చేసిన జీరో స్టార్ హోటల్ కి మంచి పేరు వచ్చింది. ఇపుడు తాజాగా ప్రకృతిలో పడక ప్లాన్ తో ముందుకు వచ్చారు.. ఎప్పుడైనా స్విస్ వెళితే ఈ వెరైటీ ఆతిధ్యాన్ని అందుకోండి మరీ.. మర్చిపోకండి..

Leave a Reply