మోడీ కేబినెట్ లోకి టీఆర్ఎస్ జితేంద‌ర్ రెడ్డి?

0
310

Posted [relativedate]

list_1382164973526229ed634fa
తెలంగాణ ప్ర‌భుత్వం, మోడీ స‌ర్కార్ మ‌ధ్య స‌త్సంబంధాలు న‌డుస్తున్నాయి. ఈమ‌ధ్య ఈ దోస్తానా మ‌రీ ఎక్కువైంది. మోడీ-కేసీఆర్ దోస్త్ మేరా దోస్త్ అంటూ పాట‌లు పాడేస్తున్నాయి. ముఖ్యంగా నోట్ల ర‌ద్దు అంశంలో త‌న‌కు మొద‌ట్నుంచి అండ‌గా ఉన్న కేసీఆర్ కు మంచి బ‌హుమ‌తి ఇవ్వాల‌ని మోడీ నిర్ణ‌యించుకున్నార‌ట‌. అందులో భాగంగా టీఆర్ఎస్ ను కేంద్ర మంత్రివ‌ర్గంలోకి తీసుకోవాల‌నే ఆలోచన‌లో ఉన్నార‌ట మోడీ. ఇంత‌కుముందు కూడా ఈ వార్త‌లొచ్చిన‌ప్ప‌టికీ ఎందుకనో వాస్త‌వ రూపం దాల్చ‌లేదు. కానీ ఈసారి మోడీ కేబినెట్ లో టీఆర్ఎస్ ఎంట్రీ ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

మోడీ కేబినెట్ లో టీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం ఇస్తున్న‌ప్పటికీ ఇందులో ఓ షాకింగ్ న్యూస్ కూడా ఉంది. క‌విత‌కు కేంద్ర‌మంత్రిగా అవ‌కాశం ఇవ్వ‌డం లేద‌ట‌. ఎందుకంటే ఆమె కంటే సీనియ‌ర్ ఎంపీలు ప‌లువురు టీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఒక‌వేళ క‌విత‌కు కేంద్ర‌మంత్రిగా అవ‌కాశం ఇస్తే.. కేసీఆర్ విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అస‌లే ఈ మ‌ధ్య ప్ర‌తిపక్షాలు దాడి పెంచుతున్నాయి. అందుక‌ని క‌విత‌కు కాకుండా ఇంకొక‌రిని కేంద్ర కేబినెట్ లోకి పంపే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీ జితేంద‌ర్ రెడ్డికి కేంద్ర‌మంత్రిగా అవ‌కాశ‌మిచ్చే ఆలోచ‌న జ‌రుగుతోంద‌ట‌. ఎందుకంటే ఆయ‌న ఇప్పుడు లోక్ స‌భ‌లో టీఆర్ఎస్ ప‌క్ష నేత వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందులోనూ రాజ‌కీయ ఉద్దండుడు జైపాల్ రెడ్డిపై ఆయ‌న గెలిచారు. ఇంత‌కుముందు కూడా ఆయ‌న లోక్ స‌భ‌కు ప్రాతినిధ్యం వ‌హించారు. అన్నింటికి మించి బ‌లమైన రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. ఇలా ఏ ర‌కంగా చూసినా జితేంద‌ర్ రెడ్డి త‌గిన వ్య‌క్తి అని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌.

జితేంద‌ర్ రెడ్డితో పాటు మ‌రొక‌రికి అవ‌కాశం ఇవ్వాల‌నుకుంటే రాజ్య‌స‌భ ఎంపీ కె. కేశ‌వ‌రావును కూడా కేంద్ర‌మంత్రివ‌ర్గం లోకి తీసుకోవ‌చ్చ‌ని స‌మాచారం. రెండు కేంద్ర‌మంత్రి ప‌ద‌వులు కావాల‌ని కేసీఆర్ కూడా మోడీని కోరార‌ట‌. మోడీ మాత్రం ఒక్క ప‌ద‌వికే ఒకే చెప్పార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే చివ‌రి నిమిషంలో ఏదైనా జ‌రగొచ్చ‌ని భావిస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్టు జరిగితే టీఆర్ఎస్ నుంచి ఇద్ద‌రికి కేంద్ర‌మంత్రులుగా అవ‌కాశం రావొచ్చ‌ని గులాబీ శ్రేణులు గుసగుస‌లాడుకుంటున్నాయి.

Leave a Reply