ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

0
484
job notification in india navy

Posted [relativedate]

job notification in india navyఇండియన్ నేవీ పర్మినెంట్ కమిషన్ విభాగంలో నావెల్ ఆర్మామెంట్ ఇన్స్‌పెక్షన్ ఎంట్రీ స్కీమ్- జూన్ 2017కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఇంజినీరింగ్ విభాగంలోని పోస్టులను భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల శిక్షణ కాలం పూర్తయిన తర్వాత సబ్ లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు.

విద్యార్హతలు: మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ప్రొడక్షన్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/ కెమికల్/ మెటలర్జికల్/ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ డిగ్రీ ఉండాలి.

వయసు: 19 1/2 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. పురుషుల కనీస ఎత్తు 157 సెం.మీ. ఉండాలి. చాతీ 80 నుంచి 85 సెం.మీ ఉండాలి.

ఎంపిక విధానం: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి జాబితా తయారు చేస్తారు. ఎంపిక చేసిన వారికి డిసెంబరు 16 నుంచి మార్చి 17 వరకు విశాఖపట్నం/ బెంగళూరు/ కోయంబత్తూరు/ భోపాల్‌ కేంద్రాల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీన్ని రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పెర్సెప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారిని రెండో దశకు అనుమతిస్తారు. దీనిలో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటాయి. వీటిని విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఇండియన్ నేవీ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా పూర్తిచేసిన దరఖాస్తులను ప్రింట్ తీసి పోస్టు ద్వారా Post Box No. 02, Sarojini Nagar PO,New Delhi -110 023 చిరునామాకు పంపాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: నవంబరు 19
చివరితేది: డిసెంబరు 9
హార్డ్ కాపీలను పంపడానికి చివరితేది: డిసెంబరు 19

నోటిఫికేషన్

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

Leave a Reply