Saturday, December 4, 2021
Homelatestసల్మాన్ నిర్దోషి ..జోధ్ పూర్ కోర్టులో ఊరట

సల్మాన్ నిర్దోషి ..జోధ్ పూర్ కోర్టులో ఊరట

అక్రమ ఆయుధాల కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి ఊరట కలిగింది.ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ జోధ్ పూర్ కోర్టు తీర్పు ఇచ్చింది.సల్మాన్ ఆయుధాలు కలిగివున్నట్టు బలమైన సాక్ష్యాలు చూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.ఈ కేసు రుజువు అయినట్టు అయితే సల్మాన్ కి 7 సంవత్సరాల జైలు శిక్ష పడి ఉండేది.ఈ తీర్పు వెలువడే సమయంలో సల్మాన్ తన సోదరి అల్వీరా తో కలిసి కోర్టులోనే వున్నారు.అయన ప్రత్యేక విమానంలో ఈ ఉదయం జోధ్ పూర్ వచ్చారు.

ప్రస్తుతం తీర్పు వచ్చిన కేసు 1998 లో సల్మాన్ మీద నమోదు అయింది.అనుమతి లేని మారణాయుధాలతో అయన వన్యప్రాణులని వేటాడారన్న ఆరోపణలతో సల్మాన్ కి వ్యతిరేకంగా అప్పట్లో నాలుగు కేసులు నమోదు అయ్యాయి.వాటిలో రెండు కేసులకు సంబంధించి ఇంతకుముందే తీర్పులు వచ్చాయి.ఆ కేసుల నుంచి సల్మాన్ కి విముక్తి లభించింది.ఇప్పుడు మూడో కేసులో తీర్పు వెలువడింది.అయన దగ్గర అనుమతి లేకుండా రెండు తుపాకులు ఉన్నట్టు రాజస్థాన్ అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేయించినా అందుకు తగ్గ సాక్ష్యాధారాలు అందించడంలో విఫలం కావడంతో సల్మాన్ బయట పడ్డాడు. ఓ సినిమా షూటింగ్ కోసం జోధ్ పూర్ అటవీ ప్రాంతానికి వెళ్లిన సల్మాన్ మరికొందరితో కలిసి జింకల్ని వేటాడినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.స్థానికులు సల్మాన్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించడం అప్పట్లో ఓ సంచలనం.

- Advertisment -
spot_img

Most Popular