పప్పు తింటారు ..పులి దగ్గరకి వెళ్లరు

0
516
jogi ramesh says if you search in google andhra pappu lokesh photo coming andhra puli jagan photo coming

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

jogi ramesh says if you search in google andhra pappu lokesh photo coming andhra puli jagan photo coming
ఒకప్పుడు ఆ దేవుడే మా వైపు వున్నాడు..పై నుంచి అన్నీ చూస్తున్నాడు.ఎప్పుడు ఎన్నికలొచ్చినా మమ్మల్నే గెలిపిస్తాడు అని వైసీపీ అధినేత జగన్ పదేపదే చెప్పేవారు.ఈయన ఎంత ఎదురు చూసినా ఆ ఎన్నికలు ముందుకు రాలేదు.దేవుడు వీళ్ళు కోరినట్టు చేయలేదు.పైగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పదేపదే ఎన్నికలు,సీఎం కుర్చీ భజన చేయొద్దని చెప్పడంతో జగన్ అండ్ కో కొద్దిగా అలెర్ట్ అయ్యారు.దేవుడు భజన ఆపేసి కొత్తగా మంత్రి అయిన లోకేష్ టార్గెట్ గా పావులు కదుపుతున్నారు.సోషల్ మీడియా లో లోకేష్ కి వ్యతిరేకంగా వస్తున్న పోస్ట్ లకు భారీగా ప్రచారం కల్పిస్తున్నారు.ఈ దశలోనే వారికి గూగుల్ దేవుడిని మించి కనపడుతోంది.

జగన్ దీక్షలో వైసీపీ నేత జోగి రమేష్ గూగుల్ భజన ఓ రేంజ్ లో చేసేసారు.గూగుల్ లో ఆంధ్రా పప్పు అని సెర్చ్ కొడితే లోకేష్ పేరు వస్తుంది,ఆంధ్రా పులి అని వెదికితే జగన్ పేరు వస్తుందని జోగి రమేష్ చెప్పడం వైసీపీ శ్రేణులు ఈలలు కేకలతో సభ ప్రాంగణాన్ని హుషారెక్కించారు.ఇదంతా విన్న ఓ వైసీపీ అభిమాని ఇదంతా నిజమే అనుకున్నాడు.తన స్నేహితుడైన ఓ టీడీపీ ఫ్యాన్ ని సరదాగా ఏడిపించవచ్చని ఫీల్ అయిపోయి అతన్ని పిలిచి గూగుల్ లో ఆంధ్రా పులి అని సెర్చ్ చేసాడు.జగన్ పేరు రాలేదు సరికదా ..ఏదో సినిమా వార్తలు,పులిహోర చేయడం గురించి కనిపించింది.దీంతో పిలిచిన స్నేహితుడికి ఏమి చెప్పాలో అర్ధం గాక కాసేపు తికమక పడ్డాడు.చివరికి తేరుకుని ఒరే..గూగుల్ లో ఆంధ్రా పప్పు,ఆంధ్రా పులి అని సెర్చ్ చేస్తే లోకేష్,జగన్ పేర్లు వస్తాయని మా వైసీపీ నాయకుడు చెప్పాడు.అది చూపించి నిన్ను కాసేపు ఏడిపిద్దామని పిలిచాను అని నిజం చెప్పాడు. అప్పటికే మేటర్ అర్ధం చేసుకున్న ఆ టీడీపీ అభిమాని ఓ మాటన్నాడు..”ఒరే బాబు నిజంగా గూగుల్ లో ఆంధ్రా పప్పు అంటే లోకేష్ పేరు,ఆంధ్రా పులి అంటే జగన్ పేరు వచ్చినా ఏమవుతుంది..నిజం చెప్పు నువ్వు పప్పు తింటావు గానీ పులి దగ్గరికి వెళతావా ?”అని.ఈ ప్రశ్నకి ఆ అభిమాని కాదు వైసీపీ అగ్రశ్రేణి నాయకులు కూడా ఏమి జవాబు ఇవ్వాలో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.

Leave a Reply