జోగులాంబ డిమాండ్ – జేజెమ్మ రిజైన్

Posted October 1, 2016

jogulamba demand dkaruna resignతెలంగాణాలో కొత్తజిల్లాల చిచ్చు రగులుతూనే వుంది. ఇప్పటిదాకా డిమాండ్లు, ఆందోళనలు, సమ్మెలతో సాగిన పర్వం ఇపుడు రాజీనామాల దాక వెళ్లింది. గద్వాల్ కేంద్రంగా జోగులాంబ జిల్లా డిమాండ్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యే డి.కే అరుణ రాజీనామాల పర్వానికి తెరలేపారు. ఆమె రాజీనామా లేఖను నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కే పంపారు. దాన్ని స్పీకర్ కు పంపి ఆమోదింపజేసుకోవచ్చని డి.కే. అరుణ స్పష్టం చేశారు.

ప్రజా ఆకాంక్షలకు దూరంగా రాజకీయ లబ్ది లక్ష్యంగా కొత్తజిల్లాల్ని ప్రకటించారని డి.కే. అరుణ ఆరోపించారు. కేవలం రాజీనామాతో ఆగబోనని జోగులాంబ జిల్లా కోసం ఉద్యమిస్తానని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకి భిన్నంగా TRS సర్కార్ ఫై డి.కే.అరుణ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో పీసీసీ పగ్గాలు దక్కించుకోవాలనే ఆమె ఈ రీతిగా ప్రవర్తిస్తున్నారని అధికార పక్షం వాదిస్తోంది. ఏదేమైనా జోగులాంబ డిమాండ్ తో జేజెమ్మ రాజీనామా తెలంగాణ రాజకీయాన్ని కొత్త మలుపు తిప్పబోతుందా? చూద్దాం!

SHARE