లోకల్ బాయ్స్ పై జోకులు

0
715
jokes on local boys

Posted [relativedate]

jokes on local boys
యూపీ ఎన్నికల్లో లోకల్ బాయ్స్ అంటూ హల్ చల్ చేసిన అఖిలేశ్ యాదవ్- రాహుల్ గాంధీ ఎలక్షన్ రిజల్ట్స్ లో తుస్సుమనిపించారు. ప్రధాని మోడీపై బీరాలు పలికి చివరకు కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయారు. దీంతో సోషల్ మీడియాలో లోకల్ బాయ్స్ పై జోకుల మీద జోకులు పేలుతున్నాయి.

“ఐయాం సారీ డాడ్” అంటూ.. అఖిలేశ్ తన తండ్రి యులాయంకు చెబుతుంటేరాహుల్ గాంధీ తన తల్లికి “ఐయాం సారీ మామ్” అని చెబుతున్న పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన ఫేక్ ఫోటోలను కూడా క్రియేట్ చేశారు.

ఇక ఎస్పీ క్యాడర్ అయితే మా పార్టీని నరేంద్రమోడీ ఓడించలేదు రాహుల్ గాంధీయే ఓడించాండంటూ అఖిలేశ్ యాదవ్ ప్లకార్డులు పట్టుకున్నట్టు పోస్టులు చేస్తున్నారు. మరికొందరైతే గుజరాత్ గాడిదలు బలంగా తన్నాయా? అంటూ అఖిలేశ్ ను ఎద్దేవా చేస్తున్నారు.

jokes on local boysఅటు తండ్రి మాట వినని అఖిలేశ్ పై ఇంకొన్ని పోస్టులు కనిపిస్తున్నాయి. తండ్రి మాట పెడచెవిన పెట్టినందుకు తగిన శాస్తే జరిగిందన్న కామెంట్ జోరుగా హల్ చల్ చేస్తోంది. కాంగ్రెస్ తో పొత్తు వద్దని తండ్రి ములాయం ఎంత చెప్పినా పట్టించుకోకుండా అఖిలేశ్ మొండిగా వెళ్లి ఘోరంగా దెబ్బతిన్నాడు. అందుకనే పెద్దల మాట చద్దిమూట అని అఖిలేశ్ సెటైర్లు పడుతున్నాయి.

మొత్తానికి యూపీ రిజల్ట్స్ దెబ్బకు లోకల్ బాయ్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అఖిలేశ్ .. రాహుల్ తో దోస్తీని పక్కనబెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. లేకపోతే అఖిలేశ్ కూడా రాహుల్ కూడా అపజయాలను కొనితెచ్చుకుంటాడని జనాలు చురకలంటిస్తున్నారు. మరి ఇవన్నీ అఖిలేశ్ చెవికెక్కుతాయో.. లేదో!!

Leave a Reply