విలేకరులకు పయ్యావుల మేత…

Posted March 23, 2017

journalist get a news about payyavula keshav
ఎప్పుడెప్పుడు మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందా…ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూపులు చూస్తున్న వారిలో టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఒకరు.పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు కాంగ్రెస్,వై.ఎస్ ని విమర్శిస్తూ నిత్యం వార్తల్లో వుండే పయ్యావుల కేశవ్ టీడీపీ అధికారంలోకి వచ్చాక మీడియాకి నల్ల పూస అయిపోయారు.కొన్నాళ్ళు పార్టీ గెలిచి తాను ఉరవకొండలో ఓడినందుకు పయ్యావుల కోలుకోలేకపోయారు.బాబు పిలిచి ధైర్యం చెప్పాక నార్మల్ అయ్యారు.ఎమ్మెల్సీ దక్కాక కాస్త జోష్ పెరిగింది.అయితే క్యాబినెట్ లో చోటు విషయం ఇంకా సస్పెన్స్ గానే వుంది.ఈ పరిస్థితుల్లో నిన్న ఒక్కసారిగా పయ్యావుల అసెంబ్లీ లాబీల్లో మురిసిపోయారు. మంత్రులతో ముచ్చటిస్తూ కనిపించడమే కాదు..జర్నలిస్టులకి మంచి మేత దొరికే టాపిక్స్ అన్నిటికీ ఆయనే సెంట్రల్ పాయింట్ గా కనిపించారు.

బాలయ్యని జగన్ పొగిడిన విషయం సోషల్ మీడియా లో గుప్పుమంటోంది.ఈ విషయాన్ని బాలయ్య సన్నిహితుడు కదిరి బాబురావు తో మాట్లాడించింది కేశవ్.ఇక గంటా పులివెందుల నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ప్రత్తిపాటి అన్న విషయాన్ని పట్టుకుని అసలు వై.ఎస్ కుటుంబం మీద ఎవరు పగబట్టారని సరదాగా లాబీల్లో పువ్వులు పూయించడంలోనూ కేశవ్ ది కీలక పాత్ర. పయ్యావుల ఒక్కసారిగా ఇంత యాక్టివ్ అయిపోయి అందరి దృష్టిలో పడడం సహజంగా జరిగిందా? లేక దీని వెనుక ఇంకేమైనా ప్లాన్ ఉందా అనిపిస్తోంది.జర్నలిస్టులకి పని పెట్టి తనకు ప్రచారం తెప్పించుకుని క్యాబినెట్ కూర్పు కసరత్తులో వున్న బాబుకి ఓ సిగ్నల్ పంపాడేమో కేశవ్ అనిపిస్తోంది.

SHARE