జర్నీ జంట ఇప్పుడు ‘బెలూన్‌’ లో…

0
448
  journey faire again act beloon
జై, అంజలి జంటగా నటించిన ‘జర్నీ’ సూపర్‌హిట్‌ అయింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో 70 ఎంఎం ఫిలిం స్‌ పతాకంపై టిఎన్‌ అరుణ్‌ బాలాజీ కందసామి నంద కుమార్‌ నిర్మిస్తున్న ‘బెలూన్‌’ చిత్రం నిర్మాణం శరవే గంగా జరుగుతోంది. ‘మర్యాద రామన్న’ ఫేం నాగినీడు మెయిన్‌ విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా సూపర్‌హిట్‌ మ్యూజిక్‌ చేస్తున్నారు. 
లెజండ్రీ డైరెక్టర్‌ వి. రామచంద్రరావు ఫ్యామిలీ నుండి వస్తున్న దర్శకుడు! 
తెలుగులో 17 చిత్రాలు డైరెక్ట్‌ చేసి అందులోనూ సూపర్‌స్టార్‌ కృష్ణతో 13 చిత్రాలకు దర్శకత్వం వహించి ‘అసాధ్యుడు’, ‘దే వుడుచేసిన మను షులు’, ‘అల్లూరి సీతారామరాజు ‘వంటి ఎన్నో సూ పర్‌హిట్స్‌ ఇచ్చిన లెజెండ్రీ డైరెక్టర్‌ వి. రామచంద్రరావు మనవరాలిని వివాహం చేసుకున్న ఎస్‌. శినీష్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు శినీష్‌ ‘బెలూన్‌’ గురించి మాట్లాడుతూ – ”కొడైకెనాల్‌లో షూటింగ్‌ జరుపుకునే రొమాంటిక్‌ హర్రర్‌ మూవీ ‘బెలూన్‌’. జై, అంజలి కెరీర్స్‌ లో మరో మైల్‌స్టోన్‌ అవుతుంది. 1989 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే రొమాంటిక్‌ హర్రర్‌ చిత్రమిది” అన్నారు. 

Leave a Reply