ఎన్టీఆర్ తో దర్శకేంద్రుడి చర్చలు.. ఇది నిజమా.. ?

Posted October 7, 2016

 jr ntr act raghavendra rao direction movie

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు జూ. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయబోతున్నాడని.. అది కూడా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నాడని.. మహా భారతంలోని ఓ ఘట్టంతో పౌరాణిక చిత్రం గానీ.. లేదా సోషియో ఫాంటసీ చిత్రాన్ని గానీ తెరకెక్కించబోతున్నాడంటూ కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్ర‌స్తుతం నాగార్జున‌తో ‘ఓం న‌మో వేంక‌టేశాయ’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు దర్శకేంద్రుడు. ఇందులో నాగ్ శ్రీవారి భక్తుడు హాథిరామ్ బాబాగా కనిపించనున్నాడు. ఈ భక్తిరస చిత్రం తర్వాత దర్శకేంద్రుడు తారక్ తో సినిమా చేయనున్నాడని సోషల్ మీడియో తెగ కామెంట్లు వచ్చిపడుతున్నాయి.

అయితే, తాజాగా రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ తో కథా చర్చలు కూడా మొదలెట్టారనే ప్రచారం మొదలైంది. రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ సినిమా చేయాలనుకున్నది
వాస్తమే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. అయితే, అప్పుడే తారక్ తో కథాచర్చలు అన్న న్యూస్ మాత్రం నమ్మలేకుండా ఉంది. ఈ చర్చలు నిజమో కాదో అన్నది తెలియాలంటే.. రాఘవేంద్ర రావు, తారక్ లలో ఎవరో ఒకరు నోరు మీడియా ముందుకు రావాల్సిందే.

SHARE