Saturday, December 4, 2021
HomeEntertainmentCinema Latestనన్ను డబ్బు మనిషి అనడం బాధగా ఉంది : ఎన్టీఆర్‌

నన్ను డబ్బు మనిషి అనడం బాధగా ఉంది : ఎన్టీఆర్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తాజాగా బిగ్‌ బాస్‌ తెలుగు వర్షన్‌కు హోస్ట్‌గా చేసేందుకు కమిట్‌ అయిన విషయం తెల్సిందే. హిందీలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బిగ్‌ బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు ఎన్టీఆర్‌ భారీ మొత్తంలో పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ పారితోషికంపై రకరకాలుగా వార్తలు వచ్చాయి. పారితోషికం ఎక్కువ ఇస్తామని మాటీవీ వారు ఆఫర్‌ చేయడం వల్లే ఎన్టీఆర్‌ ఈ బిజీ షెడ్యూల్‌లో బిగ్‌బాస్‌ షోను చేసేందుకు ముందుకు వచ్చాడని, దాదాపుగా 8 కోట్ల పారితోషికాన్ని ఎన్టీఆర్‌ తీసుకోబోతున్నట్లుగా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ విషయమై ఎన్టీఆర్‌ కాస్త అసహనంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

డబ్బుల కోసం తాను బిగ్‌బాస్‌ షోను చేసేందుకు కమిట్‌ అయినట్లుగా వస్తున్న వార్తలు కొట్టి పారేశాడు. తన సన్నిహితుల వద్ద ఈ విషయమై అసహనం వ్యక్తం చేస్తున్నాడు. డబ్బు మనిషిగా తనను సోషల్‌ మీడియాలో చిత్రీకరిస్తున్నారని ఎన్టీఆర్‌ ఒకింత బాధను కూడా సన్నిహితుల వద్ద వెళ్లబుచ్చినట్లుగా చెబుతున్నారు. డబ్బు కోసం ఎన్టీఆర్‌ ఈ కార్యక్రమం ఒప్పుకోలేదని, బుల్లి తెరపై కూడా తన సత్తా చాటాలని, ఫ్యాన్స్‌ను ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎన్టీఆర్‌ సన్నిహితులు చెబుతున్నారు. ఇక పారితోషికం సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్న స్థాయిలో లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడు షూటింగ్‌ ప్రారంభం అయ్యే విషయాన్ని మాటీవీ త్వరలో ప్రకటించనుందట.

- Advertisment -
spot_img

Most Popular