ఎన్టీఆర్ బయోపిక్ లో జూ. ఎన్టీఆర్..??

Posted February 8, 2017

jr ntr in NTR biopic movieటాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద  కాసుల వర్షం కురిపిస్తున్నాయి బయోపిక్స్. గతంలోనూ బయోపిక్స్ వచ్చినా ఇప్పుడు లాభాలు ఎక్కువ ఆర్జిస్తుండడంతో దర్శకనిర్మాతలు ఎక్కువగా బయోపిక్స్ వైపే మొగ్గుచూపుతున్నారు. ఇదే బయోపిక్ల బాటలో నడుస్తూ తన తండ్రి బయోపిక్ లో తానే నటిస్తానంటూ బాలయ్య ప్రకటించాడు. బాలయ్య ప్రకటన రాగానే ఇటు రాజకీయాలతో పాటు అటు సినీ ఇండస్ట్రీలో  కూడా వేడి మొదలైంది.

రాజకీయపరంగా పెద్ద రచ్చే  జరుగుతుండగా సినీ ఇండస్ట్రీలో కూడా రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య బదులు జూ. ఎన్టీఆర్ అయితే సరిగ్గా సరిపోతాడని ఆ చర్చల సారాంశం. బాలయ్య కాస్త ఓల్డ్ అవడంతో ఎన్టీఆర్ యంగ్ వయసులో ఉన్న పాత్రని ఎలా పోషిస్తాడని ప్రశ్నిస్తున్నారు. అదే జూ. ఎన్టీఆర్ అయితే ఎన్టీఆర్ యంగ్ గా ఉన్నప్పుటి వేషంలో చక్కగా ఒదిగిపోతాడని, అలాగే వృద్దాప్యంలోని సీన్లలో కూడా నటించగలడని అంటున్నారు. బాద్ షా సినిమాలో ఈ కుర్ర హీరో పెద్ద ఎన్టీఆర్ గా చక్కటి అభినయాన్ని ప్రదర్శించడంతో బాలయ్య కంటే  జూ. ఎన్టీఆర్ బెస్ట్ ఛాయిస్ అని చర్చించుకుంటున్నారు.

మహా నటుడు, టిడిపి పార్టీ స్ధాపకుడైన నందమూరి తారకరామరావు పాత్రల్లో నటించే అవకాశం, అదృష్టం ఎవరికి రానున్నాయో చూడాలి మరి .

SHARE