ఎన్టీఆర్ హీరోగా పౌరాణిక చిత్రం?

Posted October 4, 2016

  jr ntr raghavendra rao combo historical movie
ఎన్టీఆర్ హీరోగా పౌరాణిక చిత్రం రూపొందుతోందా? ఎప్పటినుంచో ఇలాంటి ఊహాగానాలు వస్తున్నాయి.అయితే అది రాజమౌళి దర్శకత్వంలో ఉండొచ్చని భావిస్తూ వచ్చారు.కానీ రాజమౌళి గురువు,పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు శిష్యుడైన దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్టు తాజా కబురు.అయితే ఆ సినిమా ఇప్పటికిప్పుడు మొదలు కాకపోవచ్చు.వచ్చే ఏడాది ఈ సినిమాకి సంబంధించిన పనులు మొదలవుతాయట.

ఇప్పటిదాకా రాఘవేంద్రరావు తీసిన సినిమాలకి భిన్నంగా ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీట వేస్తారని తెలుస్తోంది.భాగవతం లోని ఓ ఘట్టాన్ని తెరకెక్కించే అవకాశం ఉన్నట్టు సమాచారం.వరస హిట్ లతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇకపై కొన్ని ప్రయోగాలు చేయాలని భావిస్తున్నారట.అందుకే ఈ పౌరాణిక సినిమా ప్రతిపాదనకు ఓకే అన్నారట.

SHARE