ఎన్టీఆర్ తగ్గి పెరుగుతున్నాడు…

0
555

Posted [relativedate]

jr ntr speech at iifa awards దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్స్ మధ్య ఎంత పోటీ ఉంటుందో..వారి కోసం ఫాన్స్ యుద్ధాలు ఎలా చేసుకుంటారో తెలిసిందే.అందుకే మనసులో ఏమున్నా ఫ్యాన్స్ కోసమైనా కొన్ని ముసుగులు వేసుకోక తప్పడంలేదు స్టార్ హీరోలకి.ఐఫా అవార్డ్స్ లో జనతా గ్యారేజ్ తో ఉత్తమ నటుడిగా అవార్డు కొట్టిన ఎన్టీఆర్ మాత్రం ఆ ముసుగు తొలగించేసాడు.సహజంగా ఉత్తమనటుడి అవార్డు వచ్చిందంటే సదరు సినిమా,పాత్ర కోసం పడ్డ కష్టాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు.ఇక ఈ అవార్డు కి కారణమైన దర్శకనిర్మాతల్ని పొగిడేస్తారు.కానీ ఐఫా ఫంక్షన్ లో ఎన్టీఆర్ మాత్రం ఆ సాంప్రదాయంతో పాటు ఇంకో సంప్రదాయానికి తెర లేపాడు.

ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ వేదిక ఎక్కగానే ఎన్టీఆర్ అందరికీ సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు.తనతో పాటు ఈ అవార్డు కి పోటీ పడ్డ నామినీల పేర్లు చదివి,ఆ నటులు ఎంత బాగా యాక్ట్ చేశారో ఎన్టీఆర్ వివరించాడు.తనకి వచ్చిన అవార్డు తనది మాత్రమే కాదని తనతో పోటీ పడ్డ అందరి నటులదని చెప్పాడు.ఇక జైలవకుశ సినిమా కోసం బాగా తగ్గి అందంగా కనిపిస్తున్న ఎన్టీఆర్ దగ్గర టాలీవుడ్ లో అందగాడు ఎవరన్న ప్రస్తావన వచ్చింది.అప్పుడు ఏ మాత్రం అతిశయానికి పోకుండా ఆ విషయంలో మహేష్ ని మించినవారు లేరని కితాబు ఇచ్చాడు ఎన్టీఆర్.సింహాద్రి టైం లో చిరు పేరు తలవడానికి ఇబ్బందిపడ్డ కర్ర ఎన్టీఆర్ కి ఇప్పుడు తాను తగ్గి జన హృదయాల్లో పెరుగుతున్న ఎన్టీఆర్ కి పోలికే లేదు.ఈ పరిణితి ఎన్టీఆర్ కెరీర్ కి కూడా ఉపయోగపడాలని,టాలీవుడ్ కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేయడంలో ఎన్టీఆర్ కీ రోల్ ప్లే చేయాలని ఆశిద్దాం.

Leave a Reply