జంపింగ్ జపాంగుల్లో టెన్ష‌న్!!

0
330
jumping mlas tension in telangana

Posted [relativedate]

jumping mlas tension in telangana
తెలంగాణ‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ లో జంపింగ్ జ‌పాంగులు చాలా మంది ఉన్నారు. ఇత‌ర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి… ఆ త‌ర్వాత కారెక్కిన వారి సంఖ్య ఎక్కువే. మొద‌ట కేసీఆర్ పై ఎన్నో ఆశ‌లు పెట్టుకొని వ‌చ్చిన వారికి.. ఇప్పుడు ప‌రిస్థితులు వేరే ర‌కంగా క‌నిపిస్తున్నాయ‌ట‌. దీంతో వ‌చ్చేసారి అస‌లు త‌మ‌కు టికెట్ ఉంటుందా.. ఊడుతుందా అన్న అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి.

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన కొత్త‌లో సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టారు. ఈ దెబ్బ‌తో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఒక‌రిద్ద‌రు మిన‌హా అంద‌రూ గులాబీ కండువా వేసుకున్నారు. అటు కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది కారు ఎక్కేశారు. అయితే వారంతా అప్ప‌ట్లో ఓ లాజిక్ మిస్స‌య్యారు. అది ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు గెలిచిన చోట్ల‌.. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్య‌క్తులు నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జులుగా ఉన్నారు. అంటే ఇత‌ర పార్టీనుంచి ఒక ఎమ్మెల్యే వ‌స్తే… మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రికి టికెట్ ఇస్తారు..? ఎమ్మెల్యేకా…? లేక టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్య‌క్తికా… ? ఈ క్లారిటీ లేదు. దీంతో ఈ మ‌ధ్య కొంద‌రు జంపింగ్ ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్ పెద్ద‌ల‌కు త‌మ బాధ‌ను చెప్పుకున్నార‌ట‌. దానికి వారు ఏం ప‌ర్లేదు..!! నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న జ‌రుగుతుంది…!! టెన్ష‌న్ ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పార‌ట‌.

కేంద్రం వైఖ‌రి చూస్తుంటే నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌పై ఇప్ప‌ట్లో తేల్చేలా క‌నిపించ‌డం లేదు. దీంతో జంపింగ్ ఎమ్మెల్యేలంతా టెన్ష‌న్ ప‌డుతున్నార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు సీటు ఇవ్వ‌క‌పోతే ప‌రిస్థితి ఏంట‌ని ఆలోచిస్తున్నార‌ట‌. అప్పుడేమో ఎమ్మెల్యేల‌ను ఇత‌ర పార్టీల నుంచి లాగి… ఇప్పుడేమో టీఆర్ఎస్ పెద్ద‌లు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆ ఎమ్మెల్యేలు తెగ బాధ‌ప‌డిపోతున్నార‌ట‌. కానీ చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకొని ఏం లాభం. తిరిగి పాత పార్టీలోకి వెళ్లలేరు. టీఆర్ఎస్ లోనేమో ప‌ట్టించుకునే వారు. దీంతో త‌మ ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డైంద‌ని వాపోతున్నార‌ట ఆ ఎమ్మెల్యేలు.

Leave a Reply