విజయ్ మాల్యా బాటలో జస్టిస్ కర్ణన్..?

0
388
justice karnan going to forien like vijay malya

justice karnan going to forien like vijay malya
ఈ దేశంలో త‌ప్పులు చేయ‌డం విదేశాల‌కు ఎస్కేప్ అవ్వడం కొత్తేమీ కాదు. దావూద్ ఇబ్రహీం, ల‌లిత్ మోడీ నుంచి విజ‌య్ మాల్యా వ‌ర‌కూ ఇలా దొంగ‌చాటుగా విదేశాల‌కు ప‌రార‌యిన వారి లిస్టు చాలానే ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇప్పుడు ఎస్కేప్ అయిన వ్యక్తి దావూద్‌లాగా ఉగ్రవాదో..మాల్యా లాగా ఆర్థిక నేర‌గాడో కాదో త‌ప్పు చేసిన వారికి శిక్షలు విధించే ఒక న్యాయ‌మూర్తి. క‌ల‌క‌త్తా హైకోర్టు జ‌స్టిస్ క‌ర్ణన్ అరెస్ట్ నుంచి త‌ప్పించుకునేందుకు విదేశాల‌కు ఎస్కేప్ అయిన‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి.

సుప్రీంకోర్టు ఆదేశాల‌తో ఆయ‌న్ని అరెస్ట్ చేసేందుకు బెంగాళ్‌, త‌మిళ‌నాడు, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల పోలీసులు నిన్నటి నుంచి గాలిస్తూ ఇంత వ‌ర‌కూ ఆచూకి ప‌ట్టుకోలేక‌పోయారు. ఇప్పుడు ఆయ‌న స్నేహితుడొకాయ‌న ఇంకెక్కడి క‌ర్ణన్ ఎప్పుడో దేశం దాటి చెక్కేసుంటాడు అనేస‌రికి పోలీసులు నోరెళ్లపెడుతున్నారు.ఈ జ‌స్టిస్ క‌ర్ణన్ గారి పైత్యం గురించి కొంచెం చెప్పుకుందాం. ప‌విత్రమైన న్యాయ‌వ్యవ‌స్థలో కూడా కులాల కుంప‌టి ర‌గిలించిన ఘ‌నుడీయ‌న‌. త‌మిళ‌నాడుకు చెందిన ఓ విద్యావంతుల కుటుంబంలో పుట్టిన క‌ర్ణన్ లా చ‌దువుకుని ప‌లు హైకోర్టుల‌లో న్యాయ‌మూర్తిగా ప‌నిచేశాడు.

సాక్షాలు లేకుండా ఏ ఆరోప‌ణ‌లు నిరూపించ‌లేమ‌ని తెలిసిన న్యాయ‌మూర్తి అయి కూడా స‌హ‌చ‌ర న్యాయ‌మూర్తుల‌పై ఇష్టారీతిన ఆరోప‌ణ‌లు చేసి ఏ ఒక్కదానినీ నిరూపించ‌లేక వృత్తి స‌మాజంలోనే విలువ పోగుట్టుకున్నాడు. త‌న బ‌దిలీ ని ర‌ద్దు చేసుకుంటూ త‌నే ఉత్తర్వులు జారీ చేసుకోవ‌డం, స‌హ‌చ‌ర న్యాయ‌మూర్తుల‌కు శిక్షలు వేస్తూ తీర్పులు చెప్పడం.. ఇలాంటి వెర్రిప‌నులు చాలానే చేశాడులేండి. చివ‌రికి ఈయ‌న గారి పైత్యం ఎంత ముదిరిందంటే సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తుల‌కే శిక్ష విధిస్తూ వెంట‌నే వారిని అరెస్ట్ చేసి తన ముందు హాజరు పరచాలని పోలీసుల‌ను ఆదేశించేదాకా. క‌ర్ణన్ త‌ల‌తిక్క వ్యవ‌హారానికి ఒళ్లు మండిన సుప్రీంకోర్టు ఆయ‌న్ని ప‌ట్టుకొచ్చి ఆరునెల‌లు జైళ్లో పెట్టండ‌ని పోలీసుల‌ను ఆదేశించింది.

Leave a Reply