జ్యో అచ్యుతానంద  రివ్యూ…

224
Spread the love

 Jyo Achyutananda movie review

‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంలో దర్శకుడిగా మారాడు అవసరాల శ్రీనివాస్. తొలి చిత్రం హిట్టయిన జోష్ లో తన రెండో చిత్రంగా ” జ్యో అచ్యుతానంద “చిత్రాన్ని తెరకెక్కించారు. నారా రోహిత్ ,నాగశౌర్య, రెజినా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రమిది. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అన్నాదమ్ములు ఇద్దరూ కలిసి.. ఓ లేడీ డెంటిస్ట్ కి లైన్ వేయడం అనే పాయింట్చుట్టూ అల్లిన కథ ఇది.ఈ విషయం ఈ మూవి ఫోస్టర్స్..టీజర్ తో ఆడియన్స్ కి అర్దం అయ్యింది.ముగ్గురి మనుషుల మద్య మనసుల మధ్య దోబూచులాడిన  ఈ చిత్రం ఈరోజు  ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి.. దర్శకుడు అవసరాల రెండో విఘ్నాన్ని విజయవంతంగా దాటాడా ? అవసరాల ట్రయాంగిల్ లవ్ స్టోరీ ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొందో అసలు పోస్టర్ తో చూపించిన సినిమా ఏ సినిమానో చూద్దాం

      అచ్యుత్‌ (నారా రోహిత్‌), ఆనంద్‌ (నాగశౌర్య).. అనే ఇద్దరన్నదమ్ములు తో కధ మొదలు అవుతుంది.పేరుకు అన్నదమ్ములైనా క్లోజ్ ప్రెండ్స్ లా ఉంటారు. ఒకరికోసం మరొకరు ఏం చేయడానికైనా సిద్ధం అన్నట్లు ఉంటారు. ఇలాంటి వీరిద్దరు జ్యో (రెజీనా)ని చూసి మనసు పారేసుకుటారు. జ్యో.. వీరి ఇంటి పై ఫ్లోర్లో తండ్రితో కలసి కొత్తగా అద్దెకు దిగిన అమాయి. ఇకేముంది.. అన్నదమ్ములిద్దరూ పోటీపడి మరి..జ్యో’కి లైన్ వేస్తుంటారు. జ్యో మాత్రం వీరిద్దరిని కాదని.. తనకి ఆల్రెడీ లవ్వర్ ని ఉన్నాడని చెప్పేసి అమెరికా చెక్కేస్తుంది.ఆ తర్వాత అచ్చుత్, ఆనంద్ లు ఇద్దరూ పెళ్లి చేసుకొని.. సంసార జీవితంలో మునిగిపోతారు. సడెన్ గా అమెరికా నుంచి తిరిగొచ్చిన జ్యోఅన్నదమ్ములిద్దరికీ ఐ లవ్ యూ చెబుతుంది. జ్యో లవ్ ప్రపోజల్ కి వాళ్లెలాస్పందించారు ? ప్రేమించిన వాడిన కాదని.. అన్నదమ్ములిద్దరికి జ్యో ఎందులు ఐ లవ్ యూ చెప్పింది.. ?? ఇంతకీ జ్యో ఎవరు.. ??? అనేది మేం చెప్పేదాని కన్న సినిమా చూస్తేనే బావుంటుంది.

కధ  చాలా సింపుల్ గా ఉన్నా.. మూడు కథలని జోడించి చెప్పాడు అవసరాల.”రొమాంటిక్ కామెడీ క‌థ+థ్రిల్లర్‌ కథ+కుటుంబ కథ= జ్యో అచ్యుతానంద ” అంటే ఒకే టికెట్ పై మూడు సినిమాలు అన్నమాట.  అలాగని బోర్ కొట్టించలేడు. ఫస్ట్సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రేక్షకుడిని నవ్విస్తూనే ఉంటాడు. అవసరాల స్క్రీన్‌ప్లే మాయాజాలం అద్బుతంగా ఉంది. మొత్తంగా అచ్చ తెలుగు సినిమా చూపించాడు అవసరాల.ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే కథ నమ్ముకొని తీసిన సినిమా ఇది. ఇందులో అవసరాల మూడు కథలని చెప్పే ప్రయత్నం చేసినా ఎక్కడ కథని విడిచి సాము చేయలేదు. అలాగాని ఊకదంపుడు ఉపన్యాసాలకి చోటువ్వలేదు. కథనే బలంగా రాసుకొన్నాడు అంటే.. కథనం మరింతకట్టేపేశాడు.

మొదటి ముప్పై నిమిషాలు ఒకే కథను రెండు కోణాల్లో చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ అదే కథను దర్శకుడి కోణంలో మొదలుపెట్టడం ఇవన్నీ చాలా ఫ్రెష్ ఫీలింగ్ తెచ్చిపెట్టాయి. “ఊహసలు గుసగుసలాడే” చిత్రంలో అవసరాలకి దర్శకుడికంటే రచయిగానే ఎక్కువ మార్కులు పడ్డాయి. అయితే, ‘ జ్యో అచ్యుతానంద ‘లో రచయిత, దర్శకుడిగా కూడా మరో రెండు మెట్లు ఎక్కేశాడు. ఇది దర్శకుడి విజయం.. కాదు కాదు కథని నమ్ముకొన్న ఘన విజయం.ఇక ఈ కధ ప్రాణం పోసిన అన్నదమ్ముల గురించి చెప్పుకోలేక పోతే ఎలా…అన్నదన్నమ్ములుగా నటించిన నారా రోహిత్, నాగశౌర్య.. తెరపై నిజంగా అన్నదమ్ములా కనిపించారు. జ్యో అచ్యుతానంద  ఆడియో ఫంక్షన్ లో నాగశౌర్య చెప్పినట్టుగా అన్నదమ్ముల్లా వీరిలాగా ఇంకెవ్వరు నటించరేమో !. తెరపై నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా ల మధ్య వచ్చే సన్నివేశాలు లో టూ బెస్ట్ అనిపించారు.. 

ఇక ఈ సినిమాలో నిజమైన హీరో అవసరాల. కథ-కథనంలో ఆకట్టుకొన్నాడు. సాంకేతికంగాసినిమాకి వంక పెట్టలేము. కల్యాణ్‌ రమణ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగుంది. సినిమాఫోటోగ్రఫీ అన్ని బాగుతున్నాయి… కాకపోతే సెకాండాఫ్ లో కాస్త స్లో నేరేషన్ ఇబ్బంది పెట్టినట్టుగా అనిపిస్తుంటుంది. అయితే, అన్ని ప్లస్ లా మధ్య ఈ చిన్న మైనస్ ని ప్రేక్షకుడు గుర్తించలేడు.  ఈ కథని నమ్మన నిర్మాతల అభిరుచిని ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే. కథా బలం ఉన్న సినిమాలని ఇష్టపడే వారికి జ్యో అచ్యుతానంద  విందు భోజనం. మరి ఎందుకు ఆలేస్యం ఓ చక్కటి అచ్చ తెలుగు సినిమా చూడక చాన్నాళ్లవుతుంది అది ఎదురు చూసే వారికి ఇదో మంచి అవకాశం. త్వరగా జ్యో అచ్యుతానంద  సినిమా చూడండి

బాటమ్ లైన్ : జ్యో అచ్యుతానంద .. అద్భుత:

రేటింగ్ : 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here