అనారోగ్యంతో కన్నుమూసిన జ్యోతిలక్ష్మి

 jyothi lakshmi passed away
జ్యోతిలక్ష్మి ..ఆమె పేరే ఓ బ్రాండ్ ..సాధారణంగా సినిమాల్లోని పాత్రల పేర్లు నటీనటులకు వెంటవస్తాయి .కానీ జ్యోతిలక్ష్మి అందుకు భిన్నం .ఆమె పేరే సినిమాలకి పెట్టే పాపులారిటీ ఆమె సొంతం అయ్యింది . అయితే ఆమె ఇక లేరు .300లకు పైగా సినిమాలో నటించిన ప్రముఖ నటి, డ్యాన్సర్ జ్యోతి లక్ష్మీ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీ చిత్రాల్లో డ్యాన్సర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో జ్యోతిలక్ష్మీ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. 80వ దశకంలో జ్యోతిలక్ష్మీ పాట ఉంటే చాలు సినిమా హిట్ అన్న సెంటిమెంట్ ఉండేది. దాదాపు 300 చిత్రాల్లో ఆమె నటిస్తే, అందులో 250 వరకూ ఐటమ్ సాంగ్స్ ఉన్నాయి. గాంధర్వ కన్య,సీతారాములు, కలుసుకోవాలనిచ,బెబ్బులి, బంగారు బాబు, స్టేట్ రౌడి లాంటి చిత్రాల్లో ఆమె చేసిన పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు, కన్నడ, తమిళ, మళయాలం, హిందీ తదదిర భాషల్లో 300 వందలకు పైగా చిత్రాల్లో ఆమె నటించారు.

ఎన్నో హిట్స్ చిత్రాల్లోని ఐటెట్ సాంగ్స్ లో జ్యోతిలక్ష్మీ నటించారు. 1963 లో పెరియ ఇడతు పెన్ తమిళ చిత్రంతో అరంగ్రేటం చేసింది. తెలుగులో నటించిన తొలిచిత్రం ‘పిల్లా పిడుగా’. అనంతరం దొంగరాముడు, గాంధర్వకన్య, స్టేట్ రౌడీ, సీతారాముడు, బిగ్ బాస్, బెబ్బులి, బంగారుబాబు, కలుసుకోవాలని అనే తెలుగు చిత్రాల్లో ఆమె నటించారు. జ్యోతిలక్ష్మీ చివరిగా నటించిన చిత్రం బంగారుబాబు(2009).

ఐటమ్ సాంగ్స్ తో ఊపు ఊపేసిన ఆమె కెమెరామెన్ సాయిప్రసాద్ ను వివాహం చేసుకుని చిత్రసీమకు దూరమయ్యారు. చాలా కాలం పాటు మీడియా కంట పడకుండా ఉన్న జ్యోతి లక్ష్మీ తరువాత బుల్లితెరపై హుందాగా కనిపించే పాత్రల్లో నటించారు.గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జ్యోతిలక్ష్మీ, మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు.

SHARE