కళాతపస్వికి అత్యున్నత గౌరవం

0
399
k viswanath got dada saheb phalke award

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

k viswanath got dada saheb phalke award
తెలుగు దర్శకుడు కళాతపస్వి కె విశ్వనాథ్‌ గారు తెరకెక్కించిన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెల్సిందే. పలు జాతీయ అవార్డులు, రాష్ట్ర అవార్డులు సొంతం చేసుకున్న కె విశ్వనాథ్‌ గారికి కేంద్ర ప్రభుత్వం కాస్త ఆలస్యంగా అయినా సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ పాల్కే అవార్డును ఇవ్వడం జరిగింది. సినీ రంగంకు చెందిన ప్రముఖులకు ఇచ్చే ఈ అవార్డు తెలుగు దర్శకుడు విశ్వనాథ్‌ గారికి రావడం తెలుగు ప్రేక్షకులు అంతా గర్వించదగ్గ విషయం.

కె. విశ్వనాథ్‌ గారికి దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు ఇవ్వబోతున్నట్లు తెలుగు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించడం జరిగింది. వచ్చే నెల 3వ తారీకున రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదుగా కె. విశ్వనాథ్‌ గారు దాదా సాహెబ్‌ పాల్కే అవార్డును అందుకోబోతున్నారు. ఈ సందర్బంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు మరియు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఆయనకు అభినందనలు తెలిపి, తెలుగు వారందరికి గర్వకారణం కె విశ్వనాథ్‌ గారు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు అందుకున్న విశ్వనాథ్‌ గారికి మా తరపున కూడా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Leave a Reply