5 స్టార్ హోటల్స్ లో కబాలి…

0
507

kabali

‘కబాలి’ విడుదలకు ముందే అనేక స్పెషాల్టీలు కైవసం చేసుకుంది. రికార్డులు సెట్ చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ కావడంతోనే ‘కబాలి’కి ఇంతటి హైప్ వచ్చిందని వేరే చెప్పుకోనక్కరలేదు. ఇదిలా ఉంటే.. 22నే విడుదలవుతున్న ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ లను స్టార్ హోటల్స్ లో ప్రదర్శించాలని నిర్ణయించారు.

ఈ శుక్రవారమే కబాలి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానున్న తరుణంలో రజినీ ఫీవర్ కి అంతులేకుండాపోతుంది. చెన్నైలో అమ్మకానికి పెట్టిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోవడం తెలిసిందే. ఈ జోష్‌ను క్యాష్ చేసుకునేందుకు స్టార్‌ హోటల్స్‌లో ప్రీమియర్‌ షో కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చారు. శుక్రవారం మొదలుకుని మూడు రోజుల పాటు బెంగళూరులో పేరుమోసిన మూడు స్టార్ హోటల్స్ లో హై క్వాలిటీ సౌండ్ సిస్టమ్ వాడి ఈ కబాలిని ప్రదర్శించనున్నారట. టికెట్ ధర రూ.1300 అని – బుక్ మై షో ద్వారా ప్రేక్షకులు కొనుగోలు చేసుకోవచ్చని యాజమాన్యం ప్రకటించింది. ఈ తరహా షోలు భారత్‌లోనే తొలిసారని చెప్పుకుంటున్నారు.

Leave a Reply