కబాలి సినిమా ..అమెరికా టూర్ పై నోరు విప్పిన రజని ..

0
736

rajani-america
డివైడ్ టాక్….కబాలి గురించి అందరూ చెప్తున్న మాట .కానీ కలెక్షన్లు కుమ్మేస్తున్నాయని నిర్మాత మాట.ఈ పరిస్థితుల్లో రజని మౌనం వీడారు .కబాలిని భారీ హిట్ చేసిన అభిమానులకు ,డైరెక్టర్ ,ప్రొడ్యూసర్ ,యూనిట్ లోని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ రజని స్వయంగా లేఖ రాశారు. దీంతో కబాలి ఫలితం మీద వస్తున్న ఊహాగానాలకు ఆయనే స్వయంగా తెర దించారు.

ఇక తాను అమెరికా ఎందుకు వెళ్లారో కూడా ఈ లేఖలోనే వివరించారు .కబాలి,రోబో 2.0 సినిమాల కోసం పని చేసి …శారీరకంగా ,మానసికంగా అలసిపోయానని అందుకే విశ్రాంతి కోసం అమెరికా వెళ్లినట్టు రజని చెప్పారు .పనిలోపనిగా కొన్ని ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకున్నట్టు ఆ లేఖలోతెలిపారు .కూతురు,అల్లుడు కూడా తనతో ఉన్నట్టు తెలిపారు.మొత్తానికి ఇన్నాళ్లు సాగిన ఊహాగానాలకు ఒక్క లేఖతో తెరదించే ప్రయత్నం చేశారు రజని.

Leave a Reply