‘కబాలి’తో డైరక్టర్ రంజిత్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను డైరక్ట్ చేసిన తర్వాత ఆయన ఎవరితో సెట్స్ పైకి వెళ్తాడో అని అంతా ఆసక్తిగా చూశారు. ప్రముఖ హీరో సూర్యతో రంజిత్ నెక్స్ట్ మూవీ ఉంటుందని అనుకున్నారు. అయితే.. ఈ యువ దర్శకుడు తాజాగా ఓ ఆసక్తికర ప్రకటన చేశాడు. సూర్యతో మూవీ టాక్ అంతా పుకారేనని అన్నాడు. తన తదుపరి సినిమా కోసం కథను సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పాడు. కథ రెడీ అయిన తరువాత అందుకు తగ్గ కథానాయకుడిని ఎంచుకుంటానని పేర్కొన్నాడు. ఇంతవరకూ ఏ హీరోను తాను సంప్రదించలేదని స్పష్టం చేశాడు.