ఆన్ లైన్ లో కబాలీ ఫుల్ మూవీ లీక్ ? 

0
559
kabali1
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కబాలి రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో ఆనందం ఉరకలెత్తుతోంది. తలైవాను డాన్ రోల్ లో చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు నిర్మాతలు కూడా కబాలీని భారీగా రిలీజ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నా ఓ విషయంలో యూనిట్ తో పాటు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
కబాలి ఆన్ లైన్ లో లీకైందన్న వార్తలు ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారాయి. అంతేకాదు  సెన్సార్ బోర్డు నుంచే ఈ సినిమా లీకైనట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  దీనిపై సెన్సార్ బోర్డు చీఫ్ పహలాజ్ నిహ్లాని కూడా ఆందోళ వ్యక్తం చేశారు. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్లను కూడా పైరసీ మాఫియా వదలడం లేదన్నారాయన. కబాలిని చెన్నైలో సెన్సార్   చేశారు.. ముంబై ఆఫీస్  తో దీనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 
అంతకుముందు సల్మాన్ సూపర్ హిట్ సుల్తాన్ తో పాటు., ఉడ్తా పంజాబ్, గ్రేట్ గ్రాండ్ మస్తీ సినిమాలు విడుదలకు ముందే ఆన్ లైన్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో కబాలి నిర్మాతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత కలై పులి.ఎస్.థాను అయితే కబాలి లింకులున్న వెబ్ సైట్లను బ్యాన్ చేయాలని హై కోర్టులో  పిటిషన్ వేశారు.

Leave a Reply