తమిళనాట కబాలి పిచ్చి పీక్స్ కి వెళ్ళింది. కబాలి కేంద్రంగా సాగుతున్న పైరవీలు ,మంత్రుల పేషీలు చేస్తున్న కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి .తమిళనాడు సమాచార శాఖ మంత్రి పేషీ అధికారి ప్రేమ్ కుమార్ ఏమి చేశాడో తెలుసా?ఓ అధికారిక పత్రం మీద కబాలి థియేటర్ మేనేజర్ కి లేఖ రాశాడు.ఈ ఉత్తరం తెచ్చిన తిరు రిజ్వాన్ అనే వ్యక్తికి ..కబాలి తొలి ఆట టికెట్లు ఇవ్వమని ఆ లెటర్ సారాంశం.
ఈ లేఖ చూసిన ఆ మేనేజర్ ఏమయ్యాడో గాని ..ఈ విషయం తెలిసిన వాళ్ళు …లెటర్ చదివిన వాళ్ళు కబాలి టికెట్ల కోసం సాగుతున్న పైరవీలు చూసి తెగ నవ్వుకుంటున్నారు .. ఆ నవ్వుల్లో కబాలి రూపంలో వున్నరజనీ ..ఆయన క్రేజ్ కనిపిస్తున్నాయి .