కబాలి ప్రివ్యూ….

0
778

kabaali preview1

రజనీకాంత్.. ఈ పేరు చెబితే చాలు ప్రేక్షకులు ఊగిపోతారు. ఆయన స్టయిలే
వేరు. స్టయిల్ కే స్టయిల్ నేర్పించే రేంజ్ రజనీది. రజనీ సినిమా వస్తుంటే
చాలు పండగొచ్చినట్టే. తాజాగా రజనీ నుంచి ‘కబాలి’ పండగొచ్చింది. రజనీ
సినిమా టైటిల్ ‘కబాలి’ అని ప్రకటించప్పటి నుంచే.. ఈ సినిమాపై క్రేజ్
స్టార్టయ్యింది. తీరా రిలీజ్ టైం దగ్గరపడే కొద్ది ‘కబాలి’ క్రేజ్
ఆకాశానికి అట్టింది. పల్లె, పట్టణం తేడా లేకుండా కబాలి హంగామా మొదలైంది.
కబాలి కోసం స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ సిమ్ కార్డ్స్, వెండి నాణెలు
పుట్టుకొచ్చాయి. ఓ సినిమా కోసం కార్పోరేట్ కంపెనీలు సెలవులు ప్రకటించి,
సినిమా టికెట్లు కూడా కొనిచ్చేలా చేసింది రజనీ క్రేజ్. ‘కబాలి’ కోసం
కొన్ని కార్పోరేట్ సంస్ఠలు సెలవులు ప్రకటించడం విశేషం. రిలీజ్ కి ముందే
రూ. 220కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడంతోనే అర్థమవుతోంది
కబాలిపై క్రేజ్ ఏ రేంజ్ లో ఉందన్నది. సూపర్ రజనీకాంత్, కబాలి గురించి
ఎన్ని విశేషాలు చెప్పిన తక్కువే. అయితే, పా. రంజిత్ దర్శకత్వంలో
తెరకెక్కిన రజనీ “కబాలి”పై అంచనాలు ఆకాంశమంత ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం
లేదు. రేపు (శుక్రవారం) కబాలి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి.. రజనీ
కబాలి ఆ అంచనాలను అందుకొంటుందా.. ? ప్రేక్షకులకు అదిరిపోయే రజనీ మార్క్
హిట్ ని అందిస్తుందా.. ?? అన్నది ఆసక్తిగా మారింది.

ప్రివ్యూ :
* కబాలి సినిమా.. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా
* రజనీ.. ఈ ఒక్క పేరు చాలు అంచనాలు ఆకాంశనంటడానికి
* కబాలి విషయంలోనూ ఇలాంటి క్రేజీయే ఏర్పడింది
* రజనీ నుంచి ప్రేక్షకులు ఎక్స్ పెక్ట్ చేసేది.. స్టయిల్.. అది ‘కబాలి’లో
పుష్కలంగా కనిపిస్తోంది
* కబాలి టీజర్, ట్రైలర్ తోనే రజనీ స్టయిల్ అదిరిపోయిందని అర్థమైంది
* తాజాగా, ఇంటర్ నెట్ లో లీకైన రజనీ ఎంట్రీ సీన్స్ అద్భుతంగా ఉంది.
* కబాలి కథ దృష్ట్యా రజనీ మాఫియా డాన్ గా చెప్పుకొంటున్నారు
* డాన్ గెటప్ ని దర్శకుడు డిజైన్ చేసిన తీరు బాగుంది
* కబాలి రజనీ భాషాని గుర్తు చేస్తోంది.
* ఇప్పటికే సెన్సార్ టాక్ సూపర్ హిట్ అని వచ్చేసింది.
* కబాలి క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ సంపాదించడం మరో విశేషం.
* కబాలిలో రజనీ తర్వాత చెప్పుకోదగ్గ పేర్లు దర్శకుడు పా. రంజిత్, హీరోయిన్ రాధిక
* పా. రంజిత్ అదృష్టం కంటే.. కష్టాన్ని నమ్ముకొనే దర్శకుడు
* కబాలి విషయంలోనూ రంజిత్ కష్టం కనబడుతోంది.
* రజనీ స్టయిల్ కి ఓ యంగ్ దర్శకుడు జతకలిస్తే.. వచ్చే రిజల్ట్ కబాలి
* ఇక, హీరోయిన్ రాధిక పద్దతి ప్రకారంగా చీర కట్టులో కనబడుతోంది.
* రజనీ-రాధిక మధ్య సన్నివేశాలు చాలా బాగుంటాయని చిత్రబృందం చెబుతోంది.
*  సంతోష్ నారాయణ్ అందించి మ్యూజిక్ బాగుంది.. బ్యాంక్ గ్రౌండ్ మ్యూజిక్
మరింత బాగా ఇచ్చాడట
* వి క్రియేషన్స్ కబాలి కోసం బాగానే ఖర్చు చేసింది. సినిమాని చాలా రిచ్
గా తెరకెక్కించింది.

         ఇంతటి విశేషాలు ఉన్న రజనీ కబాలి ప్రేక్షకులను ఏ మేరకు
ఆకట్టుకుంటుందనే మరి కొన్ని గంటల్లో తేలనుంది. కబాలి లైవ్ అప్
డేట్స్,పూర్తి రివ్యూ కోసం క్లిక్ చేస్తూనే ఉండండి మీ www.telugubullet.com లో 

Leave a Reply