అయ్య బాబోయ్ కాజల్ కేక పెట్టించేసింది..!

0
476
kajal item song

kajal item song

యక చేయక ఐటం సాంగ్ చేస్తున్న కాజల్ ఎలా ఉంటుందా అన్న ఉత్సాహం తారక్ ఫ్యాన్స్ లో ఉంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో జనతా గ్యారేజ్ లో పక్కా లోకల్ సాంగ్ చేసిన కాజల్ కొద్దిగంటల క్రితం వదిలిన టీజర్ తో కేక పెట్టిచేసింది. అసలు ఈ రేంజ్లో కాజల్ డ్యాన్స్ చేస్తుందా అని డౌట్ పడేలా చేసిందంటే నమ్మేయాలి. పర్ఫెక్ట్ మాస్ మసాలా భామగా పక్కా లోక భామ కాజల్ అదరగొట్టేసింది. కొరటాల శివ ఏది ఊహించి కాజల్ తో ఈ సాంగ్ పెట్టించాడో దానికి నాలుగు రెట్లు ఎక్కువే సినిమాకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇంతకుముందు కన్నా ఈ సాంగ్లో కాజల్ స్టెప్పుల్లో కూడా ఇరగదీసింది. మరి ఈ స్పెషల్ సాంగ్ తో కాజల్ మరింత క్రేజ్ సంపాదిస్తుందని చెప్పేయొచ్చు. ఇక రిలీజ్ అవుతున్న జనతా గ్యారేజ్ మరికొద్ది గంటల్లో బెనిఫిట్ షోస్ పడనున్నాయి. భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా తారక్ కు కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అందరు అంటున్నారు.

Leave a Reply