టెంపర్ హిందీ రీమేక్ లో కాజల్..!!

0
625
kajal pair up with ranveer singh for remake of temper movie in bollywood

Posted [relativedate]

kajal pair up with ranveer singh for remake of temper movie in bollywoodఇక ఫేడ్ అవుట్ అనుకుంటున్న సమయంలో  ఖైదీ నెం. 150 సినిమాతో ఫుల్ ఫాంలోకి వచ్చేసింది కాజల్. ఇప్పుడు ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తాజాగా టెంపర్ సినిమా హిందీ రీమేక్ లో కాజల్ నే సెలెక్ట్ చేసింది చిత్రయూనిట్.

ఎన్టీఆర్, కాజల్ నటించిన టెంపర్ సినిమా ఆ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను తమిళ్ తో పాటు, హిందీలోకి కూడా రీమేక్ చేస్తున్నారు. ముందర అభిషేక్ బచ్చన్ ఈ సినిమాను రీమేక్ చేస్తాడని వార్తలు వచ్చినా ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ హీరో రణ్ వీర్ సింగ్ పేరు వినిపిస్తోంది. రోహిత్ శెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రణ్ వీర్ సింగ్ తో జోడీ కట్టేందుకు కాజల్ ని సెలెక్ట్ చేసింది చిత్రయూనిట్. ఆల్రెడీ తమిళ్ లో ఈ సినిమా రీమేక్ కి  కాజల్ నే సెలెక్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా హిందీ రీమేక్ లో కూడా కాజలే అవకాశం దక్కించుకుంది. ఇప్పటివరకు కాజల్ పలు హిందీ సినిమాల్లో నటించినా ఆమెకు ఆ సినిమాలు పేరు తీసుకురాలేకపోయాయి. మరి తెలుగులో విజయం సాధించిన టెపంర్ రీమేక్ అయినా ఆమెకు బాలీవుడ్ లో హిట్ ని అందిస్తుందేమో చూడాలి.

Leave a Reply