గూగుల్ హీరోయిన్స్ లిస్ట్ లో ఆమె..!

0
320
Kajal Third Place In Google Trends List

Kajal Third Place In Google Trends List

ఈ ఇయర్ గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన వారిలో హీరోల లిస్ట్ లో టాలీవుడ్ నుండి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫైనల్ కాగా హీరోయిన్స్ లిస్ట్ లో బాలీవుడ్ నుండి సన్ని లియోన్ టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. ఇక సెకండ్ ప్లేస్ లో కత్రినా కైఫ్ రాగా అనూహ్యంగా సౌత్ హీరోయిన్ కాజల్ థర్డ్ ప్లేస్ లో నిలిచింది. అసలు కాజల్ థర్డ్ ప్లేస్ లో రావడమేంటని అందరు షాక్ అయ్యారు. బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాపులతో ఇక పెట్టాబేడా సర్ధేయడమే అనుకున్న కాజల్ కు లక్కీగా జనతా గ్యారేజ్ ఐటం సాంగ్ రావడం అది హిట్ అయ్యి ఆ దెబ్బతో మెగాస్టార్ ఖైది నెంబర్ 150లో అవకాశం రావడం అంతా జరిగింది.

అయితే చేసే సినిమాలు హిట్టా ఫ్లాపా అని పక్కనపెడితే కాజల్ గురించి గూగుల్ లో ట్రెండ్ నడుస్తూనే ఉంది. అందుకే గూగుల్ ట్రెండ్స్ లో మోస్ట్ సెర్చెడ్ హీరోయిన్స్ లో కాజల్ మూడో స్థానంలో నిలిచింది. అయితే ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే బాలీవుడ్ నుండి హాలీవుడ్ బాట పట్టిన ప్రియాంకా చోప్రా, దీపికా పదుకునేల కన్నా కాజల్ కు ఎక్కువ ట్రెండింగ్ జరగడం విశేషం. బాలీవుడ్ లో అంత ఫాలోయింగ్ లేకున్నా సౌత్ లో ఉన్న క్రేజ్ తోనే అమ్మడికి ఈ పొజిషన్ లభించిందని చెప్పొచ్చు.

ప్రస్తుతం ఖైది సినిమాలో నటిస్తున్న కాజల్ ఓ పక్క కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తుంది. తెలుగు తమిళ భాషల్లో చేస్తున్న సినిమాలే అమ్మడికి ఈ క్రేజ్ ను తీసుకొచ్చాయి కాబట్టి ఆమెకు దక్కిన ఈ క్రెడిట్ అంతా సౌత్ ప్రేక్షకుల ద్వారా వచ్చిందే అని చెప్పొచ్చు.

Leave a Reply