కాజల్ మరో లేడీ అమితాబ్ కానుందా..?

0
104
kajal will be act lady oriented movie

Posted [relativedate]

kajal will be act lady oriented movieఒకప్పుడు సినిమాలు అంటే కేవలం హీరోల ఇమేజ్ ని, టాలెంట్ ని మాత్రమే ఎలివేట్ చేశేవి. అప్పట్లో అంత పబ్లిసిటీ కూడా లేకపోవడంతో సినిమా రిలీజయ్యేవరకు సినిమాకు సంబంధించిన విషయాలు కూడా బయటకు వచ్చేవి కావు. రిలీజైనా కానీ ఆ సినిమా ఫలానా హీరోదంట  అని మాట్లాడుకునేవారు. హీరోయిన్ల   గురించిన ప్రస్తావన పెద్దగా ఉండేది కాదు.  అటువంటి విధానాలకు చెక్ పెట్టి ఆ సినిమా ఫలానా హీరోయిన్ దట అని చెప్పుకునే ఛేంజోవర్ ని తీసుకురాగలిగింది విజయశాంతి. ఆమె సినిమాలో నటించిందంటే చాలు… ఆమె డేరింగ్ అండ్ డాషింగ్ నటనని, ఆమె ప్రదర్శించే హీరోయిజాన్ని చూడడానికే ప్రేక్షకులు ధియేటర్లకు వచ్చేవారు. దీంతో అందరూ ఆమెకు లేడీ అమితాబ్ అనే బిరుదు కూడా ఇచ్చేశారు. తాజాగా అదే రూట్లో నడవడానికి ట్రై చేస్తోందట ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు.. గ్లామరస్  డాల్, టాలీవుడ్ చందమామ కాజల్.

ప్రస్తుతం అజిత్ సరసన `వివేగం`, రానా సరసన `నేనే రాజు నేనే మంత్రి` సినిమాల్లో నటిస్తోంది ఈ అందాల చంద‌మామ. ఈ సినిమాలతో పాటే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించేందుకు  ఓకే చెప్పేసింది కాజల్. ఈ మూవీలో కాజల్ లేడీ బాండ్‌ గా క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం. జీవ హీరోగా `కావ‌లై వేండం` చిత్రం తెర‌కెక్కించిన డీకే ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం  వ‌హించ‌నున్నాడు. కావలై వేండం సినిమా రిలీజ్ అవ్వగానే ఈ తాజా చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట దర్శకనిర్మాతలు. కాగా  కాజల్ చాలా రిస్క్  చేస్తోందని, ఈమె కేవలం గ్లామరస్ పాత్రలు మాత్రమే చేయగలదని కొందరు సినీ విశ్లేషకులు అంటున్నారు. విజయశాంతి నిజజీవితంలో కూడా చాలా డేరింగ్ గా, డాషింగ్ గా ఉంటుంది కాబట్టి స్క్రీన్ మీద కూడా అదే  క్యారక్టర్ ని ప్రదర్శించగలిగిందని అంటున్నారు. క్యూట్ గా ఉండే కాజల్ ఫేస్ లో అంత సీరియస్ సన్నివేశాలు  పండవని అంటున్నారు. మరి కాజల్… మరో లేడీ అమితాబ్ అవుతుందో లేదో చూడాలి.

Leave a Reply