ఆ పొలిటికల్ డాక్టర్ ఎవరబ్బా?

124

Posted [relativedate]

kakinada doctor doing relationship increase in between jagan and pawan kalyan
జగన్,పవన్ మధ్య రాజకీయ బంధానికి బాటలు వేసే ప్రయత్నం చేస్తోంది ఓ డాక్టర్ అన్న విషయం ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.ఈ టాపిక్ మీద వైసీపీ, జనసేన శ్రేణుల నుంచి చాలా పేర్లు వినిపిస్తున్నాయి.వీటిలో ఏది నిజమో ఎవరికీ తెలియకపోయినా తమకున్న అవగాహన కొద్దీ తమ అంచనాల ప్రకారం కొన్నిపేర్లు బయటికి వినిపిస్తున్నాయి.

ఇలా డాక్టర్లు రాజకీయ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించడం కొత్తేమీ కాదు.ఎన్టీఆర్ టైం లో చాలా మంది వైద్యులు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.ఇప్పుడు ఏపీ శాసనసభ స్పీకర్ గా వున్న కోడెల శివప్రసాదరావు అలా వచ్చినవారే.ఇక ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సైతం డాక్టర్ వృత్తి వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి మామ అడుగుజాడల్లో నడిచిన విషయం అందరికీ తెలిసిందే.అంతకు ముందు కాంగ్రెస్ లోను చాలా మంది నేతలు డాక్టర్ వృత్తి నుంచి పాలిటిక్స్ లోకి వచ్చారు.కాకుంటే టీడీపీ పుట్టాక ఆ ఒరవడి ఇంకాస్త పెరిగింది.

ఇక మెగా స్టార్ చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం టైం లో రాజకీయంగా ముగ్గురు వైద్యులు కీలక పాత్ర పోషించారు.కాసు ప్రసాద రెడ్డి అనే నేత్ర వైద్యుడి ద్వారా ప్రజారాజ్యం పుట్టుక వార్త ప్రపంచానికి తెలిసింది.ఇక విదేశాల నుంచి వచ్చిన డాక్టర్ మిత్రా ప్రజారాజ్యం పార్టీ నిర్మాణంలో,వ్యూహ రచనలో కీలకంగా వున్నారు.రాజకీయ కుటుంబం పి.శివశంకర్ కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ వినయ్ కుమార్ సైతం ప్రజారాజ్యం కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరించారు. అయితే ప్రజారాజ్యం వైఫల్యంతో వీళ్ళెవ్వరూ ఇప్పుడు రాజకీయాల్లో కనిపించడం లేదు.పైగా వెళ్ళేటప్పుడు పార్టీ అధిష్టానం మీద రాళ్ళేసి మరీ వెళ్లారు.

ఇక తాజాగా జగన్,పవన్ మధ్య కూడా రాజకీయ వారధిగా ఓ డాక్టర్ వ్యవరించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.అదెవరన్నది కచ్చితంగా తెలియకపోయినా ఇటీవల జరిగిన ఓ సంఘటనని దృష్టిలో ఉంచుకుని కాకినాడకు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ పేరుని ముందుకు తెస్తున్నారు కొందరు.పేదలకి చౌకగా వైద్యం అందిస్తున్న ఈయన వ్యక్తిగత జీవితంలో పెను విషాదం వుంది.ఓ యాక్సిడెంట్ లో భార్య,కుమారుడిని కోల్పోయినా గుండె దిటవు చేసుకుని అభాగ్యుల సేవలో కాలం గడుపుతున్నారు.ఈ విషయం తెలుసుకున్న పవన్ ఇటీవల కాకినాడ వచ్చినప్పుడు ఆయన ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ చంద్రశేఖర్ కి పాదాభివందనం చేశారు.ఆ విషయం గుర్తు చేసుకుని కొందరు ఆయన పేరు కూడా ముందుకు తెస్తున్నారు.అయితే డాక్టర్ చంద్రశేఖర్ ని దగ్గరగా తెలిసినవాళ్ళు ఇదంతా ఉట్టి పుకారుగా కొట్టేస్తున్నారు.ఏదేమైనా ఇప్పుడు వైసీపీ,జనసేన కార్యకర్తలు ఆ పొలిటికల్ డాక్టర్ ఎవరబ్బా అంటూ ఆరాలు తీస్తున్నారు.దానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో ..ఆ గుట్టు ఎప్పుడు వీడుతుందో ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here