నాగ్ సినిమా ఎంత పనిచేసిందో..!

0
500
Kalyan Malik Shocking Comments On Nagarjuna

Posted [relativedate]

Kalyan Malik Shocking Comments On Nagarjunaకింగ్ నాగార్జున సినిమా మిస్ అవడం వల్ల తన కెరియర్ సంక్షొభంలో పడిపోయిందని అంటున్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్. కీరవాణి తమ్ముడైన ఈ మ్యూజిక్ డైరక్టర్ తన మెలోడీ మ్యూజిక్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే బాస్ సినిమాకు గాను నాగార్జున సినిమాకు మ్యూజిక్ అందించిన కళ్యాణ్ మాలిక్ ఆ తర్వాత నాగ్ కమిట్ అయిన తర్వాత సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా సెలెక్ట్ అయ్యాడట. కాని ఆ మూవీ డైరక్టర్ కళ్యాణ్ మాలిక్ ట్యూన్స్ నచ్చక పోవడంతో ఆ సినిమా నుండి బయటకు వచ్చాడు.

ఇక అప్పటి నుండి తనకు కష్టాలు మొదలయ్యాయని అంటున్నాడు కళ్యాణ్ మాలిక్. నాగ్ సినిమా నుండి బయటకు రావడానికి కారణాలేవైనా సరే ఆ అవకాశం మిస్ అవడం వల్ల తనకు ఛాన్సులు రాలేదని అంటున్నాడు. ఓ రకంగా నాగార్జుననే తనకు అవకాశాలు రానందుకు కారణం అన్నట్టు మాట్లాడుతున్నాడు. అయితే ప్రస్తుతం క్రేజీ డైరక్టర్స్ నందిని రెడ్డి, అవసరాల శ్రీనివాస్ లాంటి డైరక్టర్ మాత్రం కళ్యాణ్ మ్యూజిక్ తోనే హిట్లు కొడుతున్నారు. మరి చూస్తుంటే కళ్యాణ్ మాలిక్ కు ప్రస్తుతం టైం కలిసి వస్తున్నట్టు ఉంది.

మరి జరిగిన విషయాల పట్ల అసంతృప్తితో కాకుండా కొత్త ఉత్సాహంతో చేతికి వచ్చిన ప్రాజెక్టులపై కాన్సెంట్రేట్ చేస్తే బెటర్. కీరవాణి తమ్ముడైనా సరే తన సొంత టాలెంట్ తో పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు కోసం ట్రై చేస్తున్నాడు కళ్యాణ్ మాలిక్.

Leave a Reply