స్పెయిన్ లో కళ్యాణ్ కార్ చేజ్..

 kalyan ram car chasing spain ijam movie
పూరీ జగన్నాథ్ – కళ్యాణ్ రామ్‌ల కాంబినేషన్‌లో ‘ఇజం’ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై క్రేజ్ పెంచేందుకు దర్శకుడు అన్ని అస్త్రాలనూ ఉపయోగించుకుంటున్నారు. హీరోను కొత్త లుక్‌లో ప్రజెంట్ చేస్తున్నారు.  యాక్షన్‌ సీన్స్‌నూ గ్రాండ్‌గా తీస్తున్నారు. ఇప్పటికే 80%పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం స్పెయిన్‌లో ఓ భారీ షెడ్యూల్ జరుపుకుంటోంది.
ఈ షెడ్యూల్‌లో పూరీ ఓ భారీ కార్ ఛేజింగ్ సీన్‌ చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం అక్కడి పోలీస్ వ్యవస్థతో మాట్లాడి, ట్రాఫిక్ సంబంధిత పర్మిషన్ కూడా 
 తీసుకున్నారట. కొన్నిరోజుల పాటు ఈ షెడ్యూల్ అక్కడే కొనసాగుతుందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సిక్స్‌ప్యాక్ లుక్‌లో కనిపించనున్నారు.  సెప్టెంబర్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
SHARE