ఎన్టీఆర్‌ ఎమ్మెల్యే కాదు.. కళ్యాణ్‌ రామ్‌ ఎమ్మెల్యే

0
641
kalyan ram is a mla not a ntr in new movie charecter

kalyan ram is a mla not a ntr in new movie charecter
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కొన్నాళ్ల క్రితం ఎమ్మెల్యే అనే పొలిటికల్‌ చిత్రంలో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. అందుకోసం స్క్రిప్ట్‌ సిద్దం అయ్యిందని, పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఎమ్మెల్యే సినిమాను వినాయక్‌ దర్శకత్వంలో లేదా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్‌ చేస్తాడనే వార్తలు వచ్చాయి. అయితే అవన్ని ఒట్టి పుకార్లుగానే మిగిలి పోయాయి. అయితే ఒక నిర్మాత మాత్రం ఎన్టీఆర్‌ కోసం ఎమ్మెల్యే అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించి ఉంచాడు అనే విషయం ఇప్పుడు తేలిపోయింది. తాజాగా ఆ టైటిల్‌తో ఎన్టీఆర్‌ అన్న కళ్యాణ్‌ రామ్‌ సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నాడు.

పూరి దర్శకత్వంలో వచ్చిన ‘ఇజం’ చిత్రం తర్వాత కళ్యాణ్‌ రామ్‌ మళ్లీ ఇన్నాళ్లకు సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. తమ్ముడు ఎన్టీఆర్‌తో నిర్మిస్తున్న ‘జై లవకుశ’ చిత్ర నిర్మాణ కార్యక్రమంలో బిజీగా ఉండటం వల్ల కళ్యాణ్‌ రామ్‌ తన తర్వాత సినిమాకు కాస్త టైం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే శ్రీనువైట్ల శిష్యుడు అయిన ఉపేంద్ర మాధవన్‌ అనే కొత్త దర్శకుడికి కళ్యాణ్‌ రామ్‌ ఓకే చెప్పాడు. ఆ సినిమా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఆ సినిమాకే ఎమ్మెల్యే అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలున్న అబ్బాయిగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. రాజకీయ నేపథ్యంలో కాకుండా కొత్త తరహాలో ఈ సినిమా ఉంటుందని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌కు చెందిన వారు చెబుతున్నారు. కళ్యాణ్‌ రామ్‌ సొంతంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ విషయమై అధికారిక ప్రకటన మరో వారం రోజుల్లో వెలువడే అవకాశాలున్నాయి.

Leave a Reply