కళ్యాణ్ ‘చిన్ని రామయ్య’గా వస్తాడట..

 Posted October 29, 2016

kalyan ram new movie chinni ramayya‘పటాస్’తో ఫాంలోకి వచ్చాడు కళ్యాణ్ రామ్.పదేళ్ల దాహాన్ని తీర్చుకున్నాడు.అదే జోరులో పూరితో కలసి’ఇజం’చేశాడు.గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన  ‘ఇజం’ థియేటర్లలో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర ఓ మాదిరి మార్కులు వేయించుకొంది.ముఖ్యంగా కళ్యాణ్ రామ్ నటనతో ఆకట్టుకొన్నాడు.

ఈ దీపావళి పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోవడం కూడా ‘ఇజం’కి కలిసొచ్చింది.కార్తీ ‘కాష్మోరా’ హిట్ టాక్ తో రన్ అవుతున్నా..డబ్బింగ్ సినిమాలు ఇష్టపడని ప్రేక్షకులు ‘ఇజం’ థియేటర్స్ వైపు చూడొచ్చు.అయితే,ఓ వైపు’ఇజం’ రిజల్ట్ ని ఎంజాయ్ చేస్తూనే..మరోవైపు, తదపురి సినిమాకి రెడీ అవుతున్నాడు కళ్యాణ్ రామ్.

రమేష్ వర్మతో దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఈ చిత్రానికి ‘చిన్ని రామయ్య’అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కె.కె. రాధామోహన్ నిర్మాత. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతూనే.త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.ఇదిగాక,కళ్యాణ్ రామ్, మెగా యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్ చిత్రంపై కూడా జోరుగా చర్చలు జరుగుతున్నట్టు సమాచారమ్.మొత్తానికి..కళ్యాణ్ చిన్ని రామయ్యగా మారనున్నాడనే లైన్ ఆసక్తికరంగా ఉంది.

SHARE